Telugu Global
Others

Wonder World 5

హాట్‌ షిప్‌ సట్‌ ఈజిప్టుని క్రీస్తుపూర్వం 1502లో పాలించిన స్త్రీ ఫారో. ఆమెకు పూర్వం ఈజిప్టును స్త్రీలు పాలించిన దాఖలాలు లేవు. ఆమె పురుషుల్లా వస్త్రధారణ చేసుకుని, గడ్డం పెట్టుకుని, స్థనాలు లేకుండా బొమ్మలు గీయించుకుంది. *** రష్యా రాణి ఎలిజబెత్‌కి బట్టల పిచ్చి. 1762లో ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినపుడు ఆమెకు 15,000ల రకాల బట్టలు వున్నట్లు తెలిసింది. పొద్దున రెండుసార్లు సాయంత్రం మూడు సార్లు ఆమె బట్టలు మార్చుకునేదట.! *** విక్టోరియా రాణుల మాతృభాష […]

హాట్‌ షిప్‌ సట్‌ ఈజిప్టుని క్రీస్తుపూర్వం 1502లో పాలించిన స్త్రీ ఫారో. ఆమెకు పూర్వం ఈజిప్టును స్త్రీలు పాలించిన దాఖలాలు లేవు. ఆమె పురుషుల్లా వస్త్రధారణ చేసుకుని, గడ్డం పెట్టుకుని, స్థనాలు లేకుండా బొమ్మలు గీయించుకుంది.

***

ష్యా రాణి ఎలిజబెత్‌కి బట్టల పిచ్చి. 1762లో ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినపుడు ఆమెకు 15,000ల రకాల బట్టలు వున్నట్లు తెలిసింది. పొద్దున రెండుసార్లు సాయంత్రం మూడు సార్లు ఆమె బట్టలు మార్చుకునేదట.!

***

విక్టోరియా రాణుల మాతృభాష ఇంగ్లీషు కాదు. ఆమె తల్లి జర్మన్‌ డ్యూక్‌ కూతురు. ఇంట్లో జర్మనీ భాషనే మాట్లాడేది. విక్టోరియా రాణి అరవై నాలుగు సంవత్సరాలు ఇంగ్లాండును పాలించినా ఇంగ్లీషు అంత బాగా మాట్లాడ గలిగేది కాదు.

***

కేథరిన్‌ రాణి పట్టాభిషేకం కోసం పీటర్స్‌ బర్గ్‌ నుండి మాస్కోకు బయల్దేరింది. ఆమె, ఆమె పరివారం పధ్నాలుగు పెద్ద గుర్రాలు లాగే స్లెడ్జి బండ్లు, చిన్నవి 200 బండ్లలో బయల్దేరారు. వాటిలో ఒకటి చిన్ని భవనం లాగా వుండేది. అందులో మేకప్‌ రూం, లైబ్రరీ, బెడ్‌రూం అన్నీ వుండేవి.

First Published:  23 Aug 2015 1:04 PM GMT
Next Story