Telugu Global
Others

పాము కాటు... 4 జిల్లాల్లో ఆరుగురు బ‌లి 

తెలంగాణ వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో పాముకాటుకు ఐదుగురు బలైపోయారు. ఈ సంఘటనల్లో కొడుకు  మ‌ర‌ణ‌వార్త  తెలిసి  ఓ త‌ల్లి గుండె ఆగిపోయింది. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. వ‌రంగ‌ల్ జిల్లా చేర్యాల ప‌ట్ట‌ణానికి చెందిన పూల‌ వ్యాపారం చేస్తున్న దంపతులు ఎండి హుస్సేన్‌(38), ర‌హీమున్నిసా (34)లను ఇంట్లో నిద్ర‌పోతున్న స‌మ‌యంలో పాము క‌రిచింది. నిద్ర‌లో ఉండ‌డంతో వారు వెంట‌నే ఈ విష‌యాన్ని గుర్తించ‌లేక పోయారు. కాసేప‌టికి ఒళ్లంతా దుర‌దలు పెడుతోంద‌ని లేవ‌డంతో ఇంటి య‌జ‌మాని వారిని […]

తెలంగాణ వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో పాముకాటుకు ఐదుగురు బలైపోయారు. ఈ సంఘటనల్లో కొడుకు మ‌ర‌ణ‌వార్త తెలిసి ఓ త‌ల్లి గుండె ఆగిపోయింది. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. వ‌రంగ‌ల్ జిల్లా చేర్యాల ప‌ట్ట‌ణానికి చెందిన పూల‌ వ్యాపారం చేస్తున్న దంపతులు ఎండి హుస్సేన్‌(38), ర‌హీమున్నిసా (34)లను ఇంట్లో నిద్ర‌పోతున్న స‌మ‌యంలో పాము క‌రిచింది. నిద్ర‌లో ఉండ‌డంతో వారు వెంట‌నే ఈ విష‌యాన్ని గుర్తించ‌లేక పోయారు. కాసేప‌టికి ఒళ్లంతా దుర‌దలు పెడుతోంద‌ని లేవ‌డంతో ఇంటి య‌జ‌మాని వారిని స్థానిక ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌భుత్వాసుప‌త్రిలో పాముకాటుకు మందులు అందుబాటులో లేక‌ వారు మ‌ర‌ణించారు. దీంతో వారి ముగ్గురు పిల్ల‌లు అనాధ‌ల‌య్యారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా తిమ్మాపూర్ మండ‌లం పొలంప‌ల్లి గ్రామానికి చెందిన కొముర‌య్య (50) పాము కాటుతో మ‌ర‌ణించ‌గా, కొడుకు మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేని త‌ల్లి మ‌ల్ల‌వ్వ (75) గుండె ఆగి మ‌ర‌ణించింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా స‌వాయిగూడెం గ్రామానికి చెందిన శివ‌కుమార్ (18), రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండ‌లం కోట్‌ప‌ల్లి ప‌రిధిలోని బుగ్గ‌పురం గ్రామానికి చెందిన మ‌ల్లేశం అంజ‌మ్మల కుమార్తె అర్చ‌న (4) కూడా పాము కాటుకు గురై మ‌ర‌ణించారు.
First Published:  23 Aug 2015 6:40 PM IST
Next Story