గుజరాత్‌లో రిజర్వేషన్ల పోరు
పటేల్ సేనకూ ఓబీసీల కూటమికి మధ్య వార్ రాష్ట్రంలోని రెండు ప్రధాన వర్గాల మధ్య రిజర్వేషన్లలో వాటా కోసం జరుగుతున్న పోరు గుజరాత్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పటేల్ వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగంలో రిజర్వేషన్ల కోసం హార్డిక్ పటేల్ నాయకత్వంలో ఈనెల 25న ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీకి సుమారు 20 లక్షలమందికి పైగా ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే, పటేల్ రిజర్వేషన్ల పోరాటానికి వ్యతిరేకంగా ఓబీసీ వర్గం […]
BY sarvi23 Aug 2015 6:42 PM IST
sarvi Updated On: 24 Aug 2015 9:17 AM IST
పటేల్ సేనకూ ఓబీసీల కూటమికి మధ్య వార్
రాష్ట్రంలోని రెండు ప్రధాన వర్గాల మధ్య రిజర్వేషన్లలో వాటా కోసం జరుగుతున్న పోరు గుజరాత్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పటేల్ వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగంలో రిజర్వేషన్ల కోసం హార్డిక్ పటేల్ నాయకత్వంలో ఈనెల 25న ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీకి సుమారు 20 లక్షలమందికి పైగా ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే, పటేల్ రిజర్వేషన్ల పోరాటానికి వ్యతిరేకంగా ఓబీసీ వర్గం ఆదివారం పోటీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసింది. పటేల్ కమ్యూనిటీకి ఒక్క శాతం రిజర్వేషన్ పెంచినా 80 శాతమున్న ఓబీసీలు సంఘటితమై ప్రభుత్వాన్ని పడగొడతామని ఆ వర్గ నేత అల్పేష్ ఠాకూర్ హెచ్చరించడంతో రిజర్వేషన్ల పంచాయితీని ప్రధాని ముందుంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
Next Story