బీసీల కోసం పార్టీ, చానెల్, పేపర్: ఆర్.కృష్ణయ్య
దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకుని బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని టీ.టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. తమతో కలిసిరాని పార్టీలకు బీసీ వ్యతిరేక ముద్ర వేస్తామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే బీసీల కోసం జాతీయస్థాయిలో తానే స్వయంగా పార్టీ పెడతానని, బీసీలకు విస్త్రత ప్రచారం కల్పించడానికి వీలుగా టీవీ చానెల్‌ను, దినపత్రికను కూడా ప్రారంభిస్తానని ఆయన చెప్పారు. స్థానిక తాజ్‌మహల్ హోటల్లో జరిగిన బీసీ జాతీయ మేధోమథనం సదస్సులో […]
BY sarvi23 Aug 2015 6:46 PM IST
sarvi Updated On: 24 Aug 2015 9:31 AM IST
దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకుని బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని టీ.టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. తమతో కలిసిరాని పార్టీలకు బీసీ వ్యతిరేక ముద్ర వేస్తామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే బీసీల కోసం జాతీయస్థాయిలో తానే స్వయంగా పార్టీ పెడతానని, బీసీలకు విస్త్రత ప్రచారం కల్పించడానికి వీలుగా టీవీ చానెల్‌ను, దినపత్రికను కూడా ప్రారంభిస్తానని ఆయన చెప్పారు. స్థానిక తాజ్‌మహల్ హోటల్లో జరిగిన బీసీ జాతీయ మేధోమథనం సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సదస్సుకు పలు రాష్ట్రాల బీసీ నేతలు హాజరయ్యారు.
Next Story