సబ్సిడీ ఉల్లి కేంద్రాలకు పోలీస్ రక్షణ
నగరంలోని పలు రైతు బజార్ల వద్ద వినియోగదారులకు, సబ్సిడీ ఉల్లి కేంద్ర సిబ్బందికీ మధ్య ఘర్షణలు తలెత్తి దాడులకు దారి తీయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి రైతు బజార్‌లోనూ, రాయితీ ఉల్లి అమ్మక కేంద్రాల వద్ద ఆదివారం పోలీసులను రక్షణగా నియమించింది. దీంతో గ్రేటర్‌లోని 9 రైతు బజార్లతో పాటు 94 ఔట్‌లెట్ కేంద్రాల వద్ద పోలీసుల పహారాలో ఉల్లి అమ్మకాలు జరుగుతున్నాయి. బహిరంగం మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ. 60 నుంచి 80 వరకు […]
BY sarvi23 Aug 2015 6:43 PM IST
sarvi Updated On: 24 Aug 2015 9:24 AM IST
నగరంలోని పలు రైతు బజార్ల వద్ద వినియోగదారులకు, సబ్సిడీ ఉల్లి కేంద్ర సిబ్బందికీ మధ్య ఘర్షణలు తలెత్తి దాడులకు దారి తీయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి రైతు బజార్‌లోనూ, రాయితీ ఉల్లి అమ్మక కేంద్రాల వద్ద ఆదివారం పోలీసులను రక్షణగా నియమించింది. దీంతో గ్రేటర్‌లోని 9 రైతు బజార్లతో పాటు 94 ఔట్‌లెట్ కేంద్రాల వద్ద పోలీసుల పహారాలో ఉల్లి అమ్మకాలు జరుగుతున్నాయి. బహిరంగం మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ. 60 నుంచి 80 వరకు పలుకుతోంది. దీంతో ప్రభుత్వం ఆధార్ కార్డు గుర్తింపు కలిగిన వినియోగదారుడుకు కిలో ధర రూ. 20 చొప్పున రెండు కిలోల ఉల్లిని రాయితీపై అందిస్తోంది.
Next Story