Telugu Global
Others

అక్రిడేష‌న్‌ లేకపోయినా జ‌ర్న‌లిస్టుల‌కు హెల్త్‌కార్డులు 

తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న రిటైర్డ్‌, డెస్క్‌, వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్‌లకు అక్రిడేష‌న్‌తో సంబంధం లేకుండా ప్ర‌భుత్వం హెల్త్‌కార్డులు మంజూరు చేయ‌నుంద‌ని జ‌ర్న‌లిస్ట్ యూనియ‌న్ నేత‌లు వై.న‌రేంద‌ర్‌రెడ్డి, విరాహ‌త్ అలీలు ఓ  సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జ‌ర్న‌లిస్టులు ఈనెల 26వ తేదీలోగా బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లోని యూనియ‌న్ కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని వారు సూచించారు. యూనియ‌న్ల కృషి మేర‌కు అక్రిడేష‌న్‌తో సంబంధం లేకుండా హెల్త్‌కార్డులు మంజూరు చేసేందుకు ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌ని టీయూడబ్ల్యూజే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క్రాంతికిర‌ణ్ పేర్కొన్నారు. జ‌ర్న‌లిస్టులు తాము ప‌ని […]

తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న రిటైర్డ్‌, డెస్క్‌, వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్‌లకు అక్రిడేష‌న్‌తో సంబంధం లేకుండా ప్ర‌భుత్వం హెల్త్‌కార్డులు మంజూరు చేయ‌నుంద‌ని జ‌ర్న‌లిస్ట్ యూనియ‌న్ నేత‌లు వై.న‌రేంద‌ర్‌రెడ్డి, విరాహ‌త్ అలీలు ఓ సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జ‌ర్న‌లిస్టులు ఈనెల 26వ తేదీలోగా బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లోని యూనియ‌న్ కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని వారు సూచించారు. యూనియ‌న్ల కృషి మేర‌కు అక్రిడేష‌న్‌తో సంబంధం లేకుండా హెల్త్‌కార్డులు మంజూరు చేసేందుకు ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌ని టీయూడబ్ల్యూజే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క్రాంతికిర‌ణ్ పేర్కొన్నారు. జ‌ర్న‌లిస్టులు తాము ప‌ని చేస్తున్న సంస్థ గుర్తింపు కార్డుతో పాటు, ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీల‌ను జ‌త చేసి ఇవ్వాల‌ని అక్రిడేష‌న్ ఉన్న‌వారు ఒక ప్ర‌తి జెరాక్స్ కాపీని జ‌త చేయాల‌ని క్రాంతి సూచించారు. త‌ల్లిదండ్రుల‌తో స‌హా కుటుంబమంతంటీ ఈ హెల్త్‌కార్డు సౌక‌ర్యం వ‌ర్తిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.
First Published:  23 Aug 2015 6:50 PM IST
Next Story