బయటపడ్డ హిట్లర్ బంగారు రైలు!
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కనిపించకుండా పోయిన ఓ రైలు ఇపుడు బయటపడింది. రైలు తప్పి పోవడం ఏమిటని అనుకుంటున్నారా? నిజమే… ఇది ఆషామాషి రైలు కాదు. 300 టన్నుల బంగారం ఉన్న రైలు. మామూలుగా అయితే సినిమాల్లోనే ఇలాంటివి చూస్తాం. కాని నిజ జీవితంలో కూడా ఇలాంటిదొకటి ఉంటుందని ఈ వార్త చూస్తే తప్ప తెలీదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో పెద్ద మొత్తంలో బంగారం, తుపాకులతో కనిపించకుండా పోయిన ఈ రైలు దొరికినట్టు పోలెండ్‌కు […]
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కనిపించకుండా పోయిన ఓ రైలు ఇపుడు బయటపడింది. రైలు తప్పి పోవడం ఏమిటని అనుకుంటున్నారా? నిజమే… ఇది ఆషామాషి రైలు కాదు. 300 టన్నుల బంగారం ఉన్న రైలు. మామూలుగా అయితే సినిమాల్లోనే ఇలాంటివి చూస్తాం. కాని నిజ జీవితంలో కూడా ఇలాంటిదొకటి ఉంటుందని ఈ వార్త చూస్తే తప్ప తెలీదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో పెద్ద మొత్తంలో బంగారం, తుపాకులతో కనిపించకుండా పోయిన ఈ రైలు దొరికినట్టు పోలెండ్‌కు చెందిన నిధుల వేటగాళ్లు ప్రకటించారు. 1945లో జర్మనీ నుంచి హంగేరీకి ఈ రైలులో పెద్ద మొత్తంలో బంగారం, వజ్రాలు, తుపాకులు ఇతర విలువైన వస్తువుల్ని తీసుకెళ్లిన నాజీ సైనికులు ఓ రహస్య ప్రదేశంలో దీన్ని దాచి ఉంచారు. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా సైన్యం జర్మనీలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈరైలు దాచినట్టు చెబుతున్నారు. ఆ రైలులో 300 టన్నుల బంగారం ఉందట! 150 మీటర్ల పొడవున్న ఆ రైలును పోలెండ్‌లోని పర్వత ప్రాంతం గుండా వెళ్లే ఓ సొరంగ మార్గంలో దాచి, ఆ మార్గాన్ని మూసి వేశారు. అయితే ఆ రైలులో మందు పాతరలు ఉంటాయని, శత్రు సైనికుల్ని చంపేందుకు దాన్ని అలా అక్కడ ఉంచారని, దాన్ని తమకు అప్పగించాలని పోలెండ్ అధికారులు నిధుల వేటగాళ్లను హెచ్చరించారు. దానిపై ఆ దేశ అధికారులు నిపుణులతో సమావేశమైనట్టు తెలుస్తోంది. అయితే అచ్చం ఇలాంటిదే జర్మనీకి చెందిన మరో రైలు ఉందంటున్నారు. దాదాపు వెయ్యికోట్ల విలువైన బంగారం, వెండి తదితర ఆభరణాలను తరలిస్తుండగా అమెరికా సైన్యం ఈ రైలును పట్టుకొని స్వాధీనం చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు దొరికిందని చెబుతున్న రైలులో ఉన్న నిధిలో తమకు పది శాతం ఇస్తేనే దాని ఆచూకీ చెబుతామని నిధుల వేటగాళ్లు ఓ న్యాయ సంస్థ ద్వారా పోలెండ్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు.