గ్రూప్ -3,4 అభ్యర్ధులకు ప్రత్యేక కంప్యూటర్ పరీక్ష
తెలంగాణ సర్కార్ త్వరలో విడుదల చేయనున్న టీఎస్‌పీఎస్‌సీ గ్రూపు 3,4 కేటగిరీలోని కొన్ని ఉద్యోగాలకు ప్రత్యేకంగా కంప్యూటర్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు. కంప్యూటర్ ఆధారిత పనులు చేసే ఉద్యోగస్తులకు ఈ నాలెడ్జ్ తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. గ్రూప్ 3లో సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిటర్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకు, గ్రూప్4లో జూనియర్ […]
BY sarvi23 Aug 2015 6:47 PM IST
sarvi Updated On: 24 Aug 2015 9:33 AM IST
తెలంగాణ సర్కార్ త్వరలో విడుదల చేయనున్న టీఎస్‌పీఎస్‌సీ గ్రూపు 3,4 కేటగిరీలోని కొన్ని ఉద్యోగాలకు ప్రత్యేకంగా కంప్యూటర్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు. కంప్యూటర్ ఆధారిత పనులు చేసే ఉద్యోగస్తులకు ఈ నాలెడ్జ్ తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. గ్రూప్ 3లో సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిటర్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకు, గ్రూప్4లో జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అకౌంటెంట్స్, జూనియర్ స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్, అసిస్టెంట్ టైపిస్ట్ ఉద్యోగాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా కంప్యూటర్ పరీక్ష నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారిలో మొదటి షార్ట్ లిస్ట్‌ను ప్రకటించి వారికి మూడు నెలల్లోగా ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష సర్వీస్ కమిషన్ లేదా మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం నిర్వహిస్తుంది. ఆ పరీక్షలో అర్హతను సాధించిన వారితో ఎంపిక జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
Next Story