చెర్రీ సినిమాకు చిరంజీవే కీలకం
అవును.. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు శ్రీనువైట్ల వెల్లడించాడు. ఏదో కనిపించాలి కాబట్టి కనిపించాడు అన్నట్టు కాకుండా కథలో లీనం చేస్తూ అన్నయ్యను ఏకంగా 15 నిమిషాల పాటు చూపించారు రామ్ చరణ్ సినిమాలో. ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్-శ్రీనువైట్ల సినిమాలో చిరంజీవి ఓ కీలక పాత్ర పోషించారు. సోలో హీరోగా కనిపించకపోయినప్పటికీ చిరంజీవి 150వ సినిమా ఇదే అవుతుందంటున్నారు శ్రీనువైట్ల. తన 149 చిత్రాల కెరీర్ లో ఇప్పటివరకు చిరంజీవి పోషించని ఓ డిఫరెంట్ రోల్ […]
BY admin24 Aug 2015 12:32 AM IST
X
admin Updated On: 24 Aug 2015 6:37 AM IST
అవును.. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు శ్రీనువైట్ల వెల్లడించాడు. ఏదో కనిపించాలి కాబట్టి కనిపించాడు అన్నట్టు కాకుండా కథలో లీనం చేస్తూ అన్నయ్యను ఏకంగా 15 నిమిషాల పాటు చూపించారు రామ్ చరణ్ సినిమాలో. ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్-శ్రీనువైట్ల సినిమాలో చిరంజీవి ఓ కీలక పాత్ర పోషించారు. సోలో హీరోగా కనిపించకపోయినప్పటికీ చిరంజీవి 150వ సినిమా ఇదే అవుతుందంటున్నారు శ్రీనువైట్ల. తన 149 చిత్రాల కెరీర్ లో ఇప్పటివరకు చిరంజీవి పోషించని ఓ డిఫరెంట్ రోల్ ను ఈ చిత్రంలో మెగాస్టార్ పోషించారని చెబుతోంది సినిమా యూనిట్. చిరంజీవి కనిపించిన పావు గంట సేపూ ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారని భరోసా ఇస్తున్నాడు దర్శకుడు. ఇప్పటికే చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటించిన సన్నివేశాల్ని చిత్రీకరించారు. సినిమా కు సంబంధించిన ప్యాచ్ వర్క్ నడుస్తోంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి విజయదశమి కానుకగా చెర్రీ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పేరును వినాయక చవితికి విడుదల చేసే ఆలోచనలో ఉంది యూనిట్.
Next Story