స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే!?
స్టాక్‌మార్కెట్లు కుదేలయ్యాయి. మరోసారి బ్లాక్ మండే ఎఫెక్ట్‌కు గురయ్యాయి. 2008 అక్టోబర్ తర్వాత అతి చేదైన అనుభవాన్ని దలాళ్ స్ట్రీట్ చవి చూసింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఊహించని విధంగా పతనమయ్యాయి. ఒక్క రోజే సెన్సెక్స్ ఏకంగా 1624 పాయింట్ల భారీ పతనాన్ని నమోదు చేసుకుని 25,741 దగ్గర ముగిసింది. నిఫ్టీ ఏకంగా 490 పాయింట్లపైగా పతనాన్ని చవి చూసింది. చైనా ఆర్థిక ప్రగతిపై, అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న అనుమానాలు గ్లోబల్ మార్కెట్లపై ప్రతికూల […]
BY sarvi24 Aug 2015 10:50 AM IST
X
sarvi Updated On: 24 Aug 2015 10:54 AM IST
స్టాక్‌మార్కెట్లు కుదేలయ్యాయి. మరోసారి బ్లాక్ మండే ఎఫెక్ట్‌కు గురయ్యాయి. 2008 అక్టోబర్ తర్వాత అతి చేదైన అనుభవాన్ని దలాళ్ స్ట్రీట్ చవి చూసింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఊహించని విధంగా పతనమయ్యాయి. ఒక్క రోజే సెన్సెక్స్ ఏకంగా 1624 పాయింట్ల భారీ పతనాన్ని నమోదు చేసుకుని 25,741 దగ్గర ముగిసింది. నిఫ్టీ ఏకంగా 490 పాయింట్లపైగా పతనాన్ని చవి చూసింది. చైనా ఆర్థిక ప్రగతిపై, అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న అనుమానాలు గ్లోబల్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ ప్రభావం భారత స్కాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. సోమవారం ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 900 పాయింట్ల పతనాన్ని నమోదు చేసుకుంది. తర్వాత కాస్త కోలుకున్నట్లే కనిపించినా మార్కెట్లు ముగిసే సమయానికి ఏకంగా సెన్సెక్స్ 1624 పాయింట్లు అంటే 5.94 శాతం కోల్పోయింది. నిఫ్టీ 490 పాయింట్ల పతనంతో 5.92 శాతం నష్టాన్ని చవి చూసింది. ఈ క్రమంలో 8 వేల పాయింట్ల దిగువకు వచ్చేసి 7809 వద్ద నిప్టి క్లోజయ్యింది. ఈ ఒక్క రోజులోనే కొన్ని లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరై పోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా భారీ పతనాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం ముగింపుతో పోల్చితే రూపాయి విలువ రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది.
Next Story