Telugu Global
Others

Wonder World 4

విక్టోరియా రాణి తనకు రాణిగా అభిషేకం జరిగినపుడు తీసుకున్న మొట్ట మొదటి నిర్ణయం తన తల్లి పడక గది నించి తన పడకని మార్పించడం. *** ఇంగ్లాండులో నివసించని, ఇంగ్లాండును చూడని ఒక ఇంగ్లాండు రాణి వుంది. ఆమె పేరు ‘బెరంగేరియా’. ‘లైనహార్టెడ్‌’ అనబడే రిచర్డ్‌ 1ని ఆమె 1191లో పెళ్ళాడింది. *** రాణి మేరీ బోనపార్ట్‌ మనస్తత్వ శాస్త్రవేత్త. సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ని ఆస్ట్రియా నుండి తప్పించి ఇంగ్లాండు చేర్చడానికి నాజీలకు ఇరవై వేల పౌండ్లు లంచం […]

విక్టోరియా రాణి తనకు రాణిగా అభిషేకం జరిగినపుడు తీసుకున్న మొట్ట మొదటి నిర్ణయం తన తల్లి పడక గది నించి తన పడకని మార్పించడం.

***

ఇంగ్లాండులో నివసించని, ఇంగ్లాండును చూడని ఒక ఇంగ్లాండు రాణి వుంది. ఆమె పేరు ‘బెరంగేరియా’. ‘లైనహార్టెడ్‌’ అనబడే రిచర్డ్‌ 1ని ఆమె 1191లో పెళ్ళాడింది.

***

రాణి మేరీ బోనపార్ట్‌ మనస్తత్వ శాస్త్రవేత్త. సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ని ఆస్ట్రియా నుండి తప్పించి ఇంగ్లాండు చేర్చడానికి నాజీలకు ఇరవై వేల పౌండ్లు లంచం ఇచ్చింది. అప్పుడు ఆస్ట్రియా నాజీల ఆక్రమణంలో వుంది. ఫ్రాయిడ్‌ వయసు 82 సంవత్సరాలు. 1938లో ఫ్రాయిడ్‌ తప్పించుకుని ఇంగ్లాండ్‌ చేరాడు. ఫ్రాయిడ్‌ ఆ డబ్బుని తిరిగి చెల్లించాడు. తరువాత 15 నెలలు మాత్రమే జీవించాడు.

***

ఫ్రాంకిష్‌ రాజు గుంట్రాం భార్య ఐన రాణి ఆస్ట్రిచ్‌ ఇల్దియా క్రీస్తుశకం 580లో డిసెంట్రీతో బాధ పడింది. ఆమెకు చికిత్స చేసిన ఇద్దరు వైద్యులు సరైన చికిత్స చెయ్య లేదని ఆమెకు కోపం వచ్చింది. దాంతో ఒక వేళ తను చనిపోతే తన సమాధి ముందు ఆ ఇద్దరు వైద్యుల్ని చంపి పాతి పెట్టాలని భర్త నించి హామీని పొందింది. ఆ వ్యాధితోనే ఆమె చనిపోయింది. ఆమె కోరిక ప్రకారం రాజు ఆమె సమాధి ముందు ఇద్దరు వైద్యుల్ని చంపించాడు.

First Published:  22 Aug 2015 1:04 PM GMT
Next Story