ప్రత్యక్ష పోరాటానికి సై: టీ.టీడీపీ
టీఆర్‌ఎస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ఉద్యమించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఎమ్మెల్యేలు, నాయకులు ఒక్కొక్కరు ఒక్కో సమస్యను తీసుకుని క్షేత్రస్థాయి పరిశీలనతో దృష్టికి వచ్చిన సమస్యలపై వచ్చే శాసనసభ సమావేశాల్లో సర్కార్‌ను నిలదీయాలని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో జరిగిన పార్టీ శాసనసభ్యుల సమావేశంలో తీర్మానించినట్టు తెలిసింది. కర్ణాటక.. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుతున్నప్పటికీ సర్కార్ పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టాలని నిర్ణయించింది. నిజామాబాద్ […]
BY sarvi22 Aug 2015 1:09 PM GMT
sarvi Updated On: 23 Aug 2015 6:12 AM GMT
టీఆర్‌ఎస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ఉద్యమించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఎమ్మెల్యేలు, నాయకులు ఒక్కొక్కరు ఒక్కో సమస్యను తీసుకుని క్షేత్రస్థాయి పరిశీలనతో దృష్టికి వచ్చిన సమస్యలపై వచ్చే శాసనసభ సమావేశాల్లో సర్కార్‌ను నిలదీయాలని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో జరిగిన పార్టీ శాసనసభ్యుల సమావేశంలో తీర్మానించినట్టు తెలిసింది. కర్ణాటక.. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుతున్నప్పటికీ సర్కార్ పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టాలని నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల డిజైన్ మార్పుతో ఉత్పన్నమయ్యే సమస్యలపై మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఆందోళన చేపట్టనున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నారు. చీప్ లిక్కర్‌ను వ్యతిరేకిస్తూ సోమవారం ఆబ్కారీ కమిషనరేట్ ఎదుట పార్టీ తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి, పార్టీ అధికార ప్రతినిధి ప్రతాపరెడ్డి నేతృత్వంలో భారీ ధర్నా చేపట్టడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చీప్‌లిక్కర్‌కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టడానికి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. సోమవారం స్పీకర్, గవర్నర్‌ను కలిసుకునేందుకు అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు.
Next Story