వెంగమ్మపై అధికార పార్టీ ఒత్తిడి!
స్విమ్స్ ( శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్) డైరెక్టర్ వెంగమ్మ తనను స్వచ్ఛందంగా రిలీవ్ చేయమని ప్రభుత్వానికి లేఖ రాయడం వెనక అధికార పార్టీ ఒత్తిడి ఉందా? తాజాగా ఏపీ రాజకీయాల్లో నడుస్తోన్న చర్చ ఇది. అధికారిక పార్టీకి చెందిన ఓ మంత్రి తన బంధువును ఆ పదవిలో కూర్చుండబెట్టేందుకే ఆమెపై బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఇందుకోసం వెంగమ్మను తప్పుకోమని కొంతకాలంగా శాఖాపరంగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమెపై […]
BY sarvi23 Aug 2015 8:23 AM IST
X
sarvi Updated On: 23 Aug 2015 8:26 AM IST
స్విమ్స్ ( శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్) డైరెక్టర్ వెంగమ్మ తనను స్వచ్ఛందంగా రిలీవ్ చేయమని ప్రభుత్వానికి లేఖ రాయడం వెనక అధికార పార్టీ ఒత్తిడి ఉందా? తాజాగా ఏపీ రాజకీయాల్లో నడుస్తోన్న చర్చ ఇది. అధికారిక పార్టీకి చెందిన ఓ మంత్రి తన బంధువును ఆ పదవిలో కూర్చుండబెట్టేందుకే ఆమెపై బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఇందుకోసం వెంగమ్మను తప్పుకోమని కొంతకాలంగా శాఖాపరంగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమెపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఆమెపై ప్రయోగించారు. అందులో ఎలాంటి అవకతవకలు లేవని తేలడంతో ఇక నేరుగా బెదిరింపులకు దిగినట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఇంత ఒత్తిడిని భరించలేని వెంగమ్మ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగానే..ఆమె మూడురోజుల క్రితం హైదరాబాద్‌లో ఆమె ఆరోగ్య కార్యదర్శిని కలిసి తనను తప్పించాలని లేఖ అందించారని సమాచారం. నిజాయతీగా పనిచేసే అధికారులకు ఏపీలో స్థానం లేదని ఈ ఘటన మరోసారి నిరూపితమైందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇటీవల ఇసుక రీచ్ లో తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనను గుర్తుచేస్తున్నారు. ఏపీలో మహిళా అధికారులపై టీడీపీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్షకు ఇది మరో ఉదాహరణ అని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.
Next Story