సెన్సార్ కు సిద్ధమౌతున్న మారుతి సినిమా
ఎవరి సినిమా సెన్సార్ కెళ్లినా పెద్దగా అది ఎట్రాక్ట్ చేయదు. కానీ మారుతి సినిమా సెన్సార్ కు వెళ్తుందంటే మాత్రం అది పెద్ద వార్తే. సినిమా నుంచి ఎన్ని సీన్లు తొలిగించేస్తారు.. ఏ రేటింగ్ ఇస్తారు లాంటి అంశాల్ని జనాలు బాగా పట్టించుకుంటారు. ఎందుకంటే.. గతంలో పరమ బూతు సినిమాలు తీసిన ట్రాక్ రికార్డు మారుతికి ఉంది కాబట్టి. అతడి సూపర్ హిట్ మూవీ ప్రేమకథాచిత్రమ్ లో కూడా ఆ ఛాయలు కనిపిస్తాయి. ఒక దశలో వెంకటేష్ […]

ఎవరి సినిమా సెన్సార్ కెళ్లినా పెద్దగా అది ఎట్రాక్ట్ చేయదు. కానీ మారుతి సినిమా సెన్సార్ కు వెళ్తుందంటే మాత్రం అది పెద్ద వార్తే. సినిమా నుంచి ఎన్ని సీన్లు తొలిగించేస్తారు.. ఏ రేటింగ్ ఇస్తారు లాంటి అంశాల్ని జనాలు బాగా పట్టించుకుంటారు. ఎందుకంటే.. గతంలో పరమ బూతు సినిమాలు తీసిన ట్రాక్ రికార్డు మారుతికి ఉంది కాబట్టి. అతడి సూపర్ హిట్ మూవీ ప్రేమకథాచిత్రమ్ లో కూడా ఆ ఛాయలు కనిపిస్తాయి. ఒక దశలో వెంకటేష్ కూడా మారుతి సినిమాను రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే. అందుకే ఆ ఇమేజ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మారుతి. కుటుంబమంతా కలిసి చూసేలా సినిమాలు తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగా ఫీల్ గుడ్ మూవీగా భలే భలే మగాడివోయ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు మారుతి. నాని-లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమానే ఇప్పుడు సెన్సార్ గుమ్మం ముందుకొచ్చింది. మరి ఈ సినిమాతోనైనా దర్శకుడు మారుతి మారాడా.. లేక తన పాత పంథాలోనే ఎక్స్-డైలాగులు కుమ్మేశాడా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రేపు సెన్సార్ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడ్డానికి ఇదే ప్రధాన కారణం.