నోట్ల కట్టల లారీ బోల్తా!
కొత్తగా తయారైన భారత కరెన్సీ నోట్లను తీసుకెళ్తున్న కంటెయినర్ రోడ్డుపక్కన బోల్తాపడింది. ఈ నోట్ల కట్టలను కర్ణాటకలోని మైసూర్ సమీపంలోని నంజాగుడ్ ప్రెస్ నుంచి కేరళలోని తిరువనంతపురం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తరలిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ సమీపంలో రోడ్డుకు అడ్డుగా వచ్చిన మేకను తప్పించే యత్నంలో ట్రక్కు బోల్తాపడింది. సెంట్రల్ ఇండస్ర్టియల్ సెక్యూరిటీ ఫోర్సస్ (సీఐఎస్ఎఫ్) బలగాలు ట్రక్కుకు ఎస్కార్టుగా ఉన్నాయి. కరెన్సీకి ఎలాంటి నష్టం కలగలేదని, వెంటనే కంటెయినర్‌ను […]
BY sarvi23 Aug 2015 2:07 AM IST
X
sarvi Updated On: 23 Aug 2015 6:14 AM IST
కొత్తగా తయారైన భారత కరెన్సీ నోట్లను తీసుకెళ్తున్న కంటెయినర్ రోడ్డుపక్కన బోల్తాపడింది. ఈ నోట్ల కట్టలను కర్ణాటకలోని మైసూర్ సమీపంలోని నంజాగుడ్ ప్రెస్ నుంచి కేరళలోని తిరువనంతపురం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తరలిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ సమీపంలో రోడ్డుకు అడ్డుగా వచ్చిన మేకను తప్పించే యత్నంలో ట్రక్కు బోల్తాపడింది. సెంట్రల్ ఇండస్ర్టియల్ సెక్యూరిటీ ఫోర్సస్ (సీఐఎస్ఎఫ్) బలగాలు ట్రక్కుకు ఎస్కార్టుగా ఉన్నాయి. కరెన్సీకి ఎలాంటి నష్టం కలగలేదని, వెంటనే కంటెయినర్‌ను మరో ట్రక్కుపైకి మార్చి క్షేమంగా తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ట్రక్కులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన సామగ్రి కూడా ఉందని సమాచారం.
Next Story