Telugu Global
NEWS

హైద‌రాబాద్‌లో మ‌రో లాక‌ప్‌డెత్‌?

బోనాల సంద‌ర్భంగా ఇటీవ‌ల బోయిన్‌ప‌ల్లి ఠాణాలో ఓ యువ‌కుడు పొలీసులు చిత‌క‌బాద‌డంతోనే చ‌నిపోయార‌న్న ఆరోప‌ణ‌లు మ‌ర‌వ‌క‌ముందే మ‌రో లాక‌ప్‌డెత్ చోటు చేసుకుంది. హైద‌రాబాద్‌లోని ఆసిఫ్‌న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఆదివారం ఉద‌యం ఓ మ‌హిళ మృతిచెంద‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ప‌ద్మ అనే మ‌హిళ‌ను దొంగ‌త‌నం కేసులో భాగంగా పోలీసులు విచార‌ణ నిమిత్తం ఆసిఫ్‌న‌గ‌ర్ ఠాణాకు తీసుకువ‌చ్చారు. కానీ ఆదివారం ఉద‌యానిక‌ల్లా చ‌నిపోయింద‌ని తెలుసుకున్న బంధువులు పోలీసుల తీరుపై అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారు. పోలీసులు చిత‌క‌బాద‌డంతోనే దెబ్బ‌లు తాళ‌లేక ప‌ద్మ చ‌నిపోయింద‌ని […]

హైద‌రాబాద్‌లో మ‌రో లాక‌ప్‌డెత్‌?
X

బోనాల సంద‌ర్భంగా ఇటీవ‌ల బోయిన్‌ప‌ల్లి ఠాణాలో ఓ యువ‌కుడు పొలీసులు చిత‌క‌బాద‌డంతోనే చ‌నిపోయార‌న్న ఆరోప‌ణ‌లు మ‌ర‌వ‌క‌ముందే మ‌రో లాక‌ప్‌డెత్ చోటు చేసుకుంది. హైద‌రాబాద్‌లోని ఆసిఫ్‌న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఆదివారం ఉద‌యం ఓ మ‌హిళ మృతిచెంద‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ప‌ద్మ అనే మ‌హిళ‌ను దొంగ‌త‌నం కేసులో భాగంగా పోలీసులు విచార‌ణ నిమిత్తం ఆసిఫ్‌న‌గ‌ర్ ఠాణాకు తీసుకువ‌చ్చారు. కానీ ఆదివారం ఉద‌యానిక‌ల్లా చ‌నిపోయింద‌ని తెలుసుకున్న బంధువులు పోలీసుల తీరుపై అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారు. పోలీసులు చిత‌క‌బాద‌డంతోనే దెబ్బ‌లు తాళ‌లేక ప‌ద్మ చ‌నిపోయింద‌ని ఆరోపిస్తున్నారు. ప‌ద్మ మృతికి పోలీసులు బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప‌ద్మ మృతికి కార‌ణాలు అధికారికంగా ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల దెబ్బ‌ల వ‌ల్లే మ‌ర‌ణించిందా? లేదా ఏదైనా అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల ఇలా జ‌రిగిందా? అన్న విష‌యంపై అధికారులు ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది. ఉన్న‌తాధికారులు వ‌చ్చి ప‌రిశీలించిన మీద‌ట దీనిపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

First Published:  23 Aug 2015 7:29 AM IST
Next Story