Telugu Global
Others

భారత్‌తో చర్చలకు పాక్‌ మంగళం!

భారత్‌-పాక్‌ జాతీయ భద్రత సలహాదారుల (ఎన్‌ఎస్‌ఏ) చర్చ నుంచి పాకిస్థాన్‌ వైదొలగింది. భారత్‌ ముందస్తు షరతులు విధిస్తోందని కుంటిసాకు చెబుతూ తాము చర్చలకు రాబోమని పాక్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది. నిరుడు ఆగస్టులో విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలకు ముందు కూడా పాకిస్థాన్‌ ఇదే తరహాలో మడత పేచీ పెట్టింది. దీంతో అప్పట్లో భారత్‌ సదరు చర్చలను రద్దు చేసింది. ఇప్పుడు దీనికి ప్రతీకారంగానా అన్నట్లు పాక్‌ చివరిదాకా సాగదీసి, చర్చలకు రాబోనని ప్రకటించింది. ఉగ్రవాదంపై […]

భారత్‌తో చర్చలకు పాక్‌ మంగళం!
X
భారత్‌-పాక్‌ జాతీయ భద్రత సలహాదారుల (ఎన్‌ఎస్‌ఏ) చర్చ నుంచి పాకిస్థాన్‌ వైదొలగింది. భారత్‌ ముందస్తు షరతులు విధిస్తోందని కుంటిసాకు చెబుతూ తాము చర్చలకు రాబోమని పాక్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది. నిరుడు ఆగస్టులో విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలకు ముందు కూడా పాకిస్థాన్‌ ఇదే తరహాలో మడత పేచీ పెట్టింది. దీంతో అప్పట్లో భారత్‌ సదరు చర్చలను రద్దు చేసింది. ఇప్పుడు దీనికి ప్రతీకారంగానా అన్నట్లు పాక్‌ చివరిదాకా సాగదీసి, చర్చలకు రాబోనని ప్రకటించింది. ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు ప్రధానాంశంగా చర్చల నిమిత్తం సోమవారం ఢిల్లీలో రెండుదేశాల ఎన్‌ఎస్‌ఏలు అజిత్‌ దోవల్‌, సర్తాజ్‌ అజీజ్‌ సమావేశం కావాల్సి ఉంది. గతనెలలో ప్రధాని మోడీ ఉఫాలో పాక్‌ ప్రధాని షరీఫ్‌తో భేటీ అయ్యాక కుదిరిన అంగీకారం మేరకు ఈ భేటీకి ముహూర్తం ఖరారైంది. అయితే, సమావేశం తేదీ సమీపిస్తుండగా ప్రధాన చర్చనీయాంశానికి కాశ్మీర్‌ సమస్యనూ పాక్‌ ముడిపెట్టింది. పైగా విందు పేరిట కాశ్మీర్‌ వేర్పాటువాద నేతలతో అజీజ్‌ భేటీకి పాక్‌ హై కమిషన్‌ ఆహ్వానాలు పంపింది. దీనిపై నాలుగు రోజులుగా నలుగుతున్న వివాదం పలు సవాళ్లకు దారితీసి, ఎట్టకేలకు పాక్‌ వెన్నుచూపడంతో ఉత్కంఠ ముగిసింది. అంతకుముందు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు మాత్రమే చర్చలు పరిమితమని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు. దీనిపై ఇస్లామాబాద్‌లో అజీజ్‌ స్పందిస్తూ కేవలం ఉగ్రవాదంపై మాత్రమే చర్చలకయితే తాము రాబోమని ప్రకటించారు. కాశ్మీర్‌ను కూడా చర్చల్లో చేర్చాలని అన్నారు. దీంతో పాక్‌ వైఖరి మరోసారి వెల్లడయ్యింది.
First Published:  23 Aug 2015 11:11 AM IST
Next Story