జనం సొమ్ము- అచ్చుతప్పుల పాలు
మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి స్మృతి ఇరానీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ శాఖ అంతా వివాదాలమయం. అలాంటి గొప్ప శాఖను చేపట్టడానికి ఆమెకున్న అర్హతలేమిటనేది ప్రజలు ప్రశ్నించకూడదు. ఓట్లువేసి గెలిపించడం వరకే మన బాధ్యత. ఆ తర్వాత ప్రధానమంత్రుల, ముఖ్యమంత్రుల నిర్ణయాధికారాన్ని మనం భరించాల్సిందే! వైఎస్ రాజశేఖరరెడ్డి దానం నాగేందర్‌ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా నియమించినప్పుడు విద్యావంతులు నోరెళ్ళబెట్టారు. నరేంద్రమోడీ స్మృతీ ఇరానీని హెచ్‌ఆర్‌డి మంత్రిగా చేసినప్పుడు విద్యావంతులకు దిమ్మతిరిగింది. ఆమె […]
మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి స్మృతి ఇరానీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ శాఖ అంతా వివాదాలమయం. అలాంటి గొప్ప శాఖను చేపట్టడానికి ఆమెకున్న అర్హతలేమిటనేది ప్రజలు ప్రశ్నించకూడదు. ఓట్లువేసి గెలిపించడం వరకే మన బాధ్యత. ఆ తర్వాత ప్రధానమంత్రుల, ముఖ్యమంత్రుల నిర్ణయాధికారాన్ని మనం భరించాల్సిందే!
వైఎస్ రాజశేఖరరెడ్డి దానం నాగేందర్‌ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా నియమించినప్పుడు విద్యావంతులు నోరెళ్ళబెట్టారు. నరేంద్రమోడీ స్మృతీ ఇరానీని హెచ్‌ఆర్‌డి మంత్రిగా చేసినప్పుడు విద్యావంతులకు దిమ్మతిరిగింది.
ఆమె ఘనకార్యాలలో ఇటీవల చేసిన ఒక ఘనకార్యం ఏమిటంటే ఆమె సిబిఎస్‌ఇ టీచర్లందరినీ అభినందిస్తూ జూలై 11న ఒక లెటర్ పోస్ట్‌చేసింది. ఉత్తమ ఉపాధ్యాయుల్ని కొద్ది మందిని అభినందిస్తూ ఉత్తరాలు రాస్తే మంచిదే. అందరి టీచర్లకూ లెటర్స్ ఎందుకు రాసినట్లు? దానివల్ల ప్రయోజనం ఏమిటి? వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవాలనుకోవడం తప్ప! ప్రజల సొమ్ము లక్షల్లో వృధాకావడం తప్ప! ఆమె లెటర్ అందుకున్న కొంతమంది టీచర్లు సంబరపడిపోయి తమకు వచ్చిన లెటర్‌ను ఫేసుబుక్కుల్లో పెట్టుకున్నారు. సంబరపడ్డారు. కాని అలాంటి ఉత్తరాలు ప్రతి టీచర్‌కూ వచ్చాయని తెలిసి చప్పబడిపోయారు.
ఉత్తరంలో టీచర్లను ప్రోత్సహించే ప్రత్యేక అంశాలేమీ లేవు. అచ్చు తప్పులు తప్ప. లెటర్ హెడ్‌లో రెండు అచ్చు తప్పులు. మినిష్టర్ అనేపదం స్పెల్లింగ్ తప్పు. అది చూసి మంచి టీచర్లంతా నవ్వుకున్నారు.
నిజమే ఆమె పంపిన లెటర్ ఆమె స్థాయిలోనే ఉంది.