షాద్ నగర్‌లో పేలుడు ముగ్గురి మృతి!
మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఓ ఇంట్లో పేలుడు సంభవించడంతో ఒకే ఇంట్లో ముగ్గురు మృతిచెందారు. షాద్‌నగర్ మండలం పటేల్‌రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం.. పటేల్‌రోడ్డుకు చెందిన యాదగిరి లారీ డ్రైవర్. అతని ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు భారీ పేలుడు సంభవించింది. దీంతో ఊరు మొత్తం ఉలిక్కిపడింది. ఈ ఘోర ప్రమాదంలో ఇంట్లో ఉన్న యాదగిరి భార్య జయ (50) కుమారులు చిట్టి (19), చరణ్ (19)లు […]
BY sarvi23 Aug 2015 8:02 AM IST

X
sarvi Updated On: 23 Aug 2015 8:02 AM IST
మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఓ ఇంట్లో పేలుడు సంభవించడంతో ఒకే ఇంట్లో ముగ్గురు మృతిచెందారు. షాద్‌నగర్ మండలం పటేల్‌రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం.. పటేల్‌రోడ్డుకు చెందిన యాదగిరి లారీ డ్రైవర్. అతని ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు భారీ పేలుడు సంభవించింది. దీంతో ఊరు మొత్తం ఉలిక్కిపడింది. ఈ ఘోర ప్రమాదంలో ఇంట్లో ఉన్న యాదగిరి భార్య జయ (50) కుమారులు చిట్టి (19), చరణ్ (19)లు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడ్డ మరో కుమారుడు భరత్ ప్రస్తుతం షాద్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న షాద్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టానికి పంపారు. తొలుత సిలిండర్ లీకవ్వడమే పేలుడుకు కారణమని భావించారు. కానీ బంధువులు ఇంట్లో సిలిండర్ అయిపోయి వారంపైనే అయిందని చెబుతున్నారు. కొంతకాలంగా యాదగిరి తన ఇంట్లో భారీగా కిరోసిన్, పెట్రోల్ నిలువు ఉంచుతున్నాడని సమాచారం. పేలుడుకు అదే కారణమని భావిస్తున్నారు.
Next Story