Telugu Global
Others

Wonder World 3

నెపోలియన్‌ సెంట్‌ హెలీనా ద్వీపంలో బంధింప బడి వున్నప్పుడు ఆయన్ని విడిపించడానికి ఒక ప్రణాళిక వేశారు. న్యూఆర్లీన్స్‌ యుద్ధరంగంలో పనిచేసిన డొమినిక్‌యు ఆ పనికి పూనుకున్నాడు. ఆ పథకం ప్రకారం నెపోలియన్‌ని విడిపించి టూసియునా నగరానికి తీసుకొచ్చి ఆ నగర మేయర్‌ ఐన నికలస్‌గిరాడ్‌ ఇంట్లో బస ఏర్పాటు చెయ్యడం, ఆ పని మొదలయ్యేలోగా నెపోలియన్‌ మరణించాడు. ఇప్పటికీ ఆ మేయర్‌ ఇంటికి ‘నెపోలియన్‌ హౌస్‌’ అన్న పేరే వుంది. *** మధ్య యుగాల్లోని రాజుల్లో ఫ్రెడరిక్‌ […]

నెపోలియన్‌ సెంట్‌ హెలీనా ద్వీపంలో బంధింప బడి వున్నప్పుడు ఆయన్ని విడిపించడానికి ఒక ప్రణాళిక వేశారు. న్యూఆర్లీన్స్‌ యుద్ధరంగంలో పనిచేసిన డొమినిక్‌యు ఆ పనికి పూనుకున్నాడు. ఆ పథకం ప్రకారం నెపోలియన్‌ని విడిపించి టూసియునా నగరానికి తీసుకొచ్చి ఆ నగర మేయర్‌ ఐన నికలస్‌గిరాడ్‌ ఇంట్లో బస ఏర్పాటు చెయ్యడం, ఆ పని మొదలయ్యేలోగా నెపోలియన్‌ మరణించాడు. ఇప్పటికీ ఆ మేయర్‌ ఇంటికి ‘నెపోలియన్‌ హౌస్‌’ అన్న పేరే వుంది.

***

ధ్య యుగాల్లోని రాజుల్లో ఫ్రెడరిక్‌ 1 చక్రవర్తి నాస్తికుడు. అతని ఆస్థానంలో అన్ని మతాలకు చెందిన మేధావులు వుండేవారు.

***

హ్యూగ్‌ కాపెట్‌ కుటుంబానికి చెందిన రాజులే 967 నుండి 1328 దాకా ఫ్రాన్స్‌ను పాలించారు. ఆ కుటుంబానికి దగ్గర సంబంధమున్న మరో కుటుంబం వాలోయిస్‌, బోర్బన్‌ రాజకుటుంబీకులు పందొమ్మిదో శతాబ్దం దాకా పాలించారు.

***

లూయీస్‌ 9 చక్రవర్తి రుషితుల్యుడుగా పరిగణింప బడ్డాడు. అతను క్రైస్తవ విధుల్ని తుచ తప్పకుండా పాటించేవాడు. భార్య పట్ల విశ్వాసపాత్రంగా మెలిగేవాడు. వాళ్ళకు పదకొండు మంది సంతానం. నిరాడంబర వస్త్రధారణ చేసేవాడు. కుష్ఠురోగుల్ని ముద్దు పెట్టుకునేవాడు. పేదవాళ్ళతో కలిసి భోజనం చేసేవాడు. న్యాయా న్యాయాలు చట్టప్రకారంగా జరిగేలా చేశాడు. దొంగతనం, జూదం, వ్యభిచారాలకు వ్యతిరేకంగా కఠినమయిన చర్యలు తీసుకున్నాడు. యూదుల్ని నాస్తికుల్ని క్రూరంగా హింసించడాన్ని మానిపించాడు. 1297లో టునీస్‌లో ప్లేగుతో మరణించాడు. సెంట్‌లూయీస్‌ చర్చిలో అతన్ని సమాధి చేశారు.

***

సీజర్‌ను హత్య చేసిన రెండు వేల సంవత్సరాల తరువాత ప్రపంచ పాలకులు అతని పేరును తమ పేరుతో జోడించుకోవడం ఆనవాయితీగా వచ్చింది. ఆధునిక కాలంలో జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీ రాజులు ‘కైజర్‌’ అని పిలువబడేవాళ్ళు. జర్మన్‌ భాష ప్రకారం వుచ్ఛరిస్తే సీజర్‌ అన్న పదం కైజర్‌లా వినపడుతుంది. రష్యన్‌ రాజులను జార్‌ అనడం తెలిసిందే. అది సీజర్‌ పదాన్ని రష్యన్‌ భాషలో పలికితే అలా మారింది. 1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేదాకా మనల్ని పాలించిన ఇంగ్లాండు రాజుల్ని కైజర్‌-ఎ-హింద్‌ అనే బిరుదుతో కలిపి పిలిచేవారు.

First Published:  21 Aug 2015 1:04 PM GMT
Next Story