Telugu Global
Others

ఆదివారం రాజధాని ప్రాంతంలో పవన్‌ పర్యటన!

జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కార్యరంగంలోకి దూకుతున్నారు. ఆదివారం ఆయన ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. నవ్యాంధ్ర రాజధానికి రైతుల నుంచి బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న ఆయన ఈ అంశంపై ఇప్పటికే పలు మార్లు ట్వీట్ల ద్వారా ప్రభుత్వానికి తన అభిప్రాయాన్ని తెలిపారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోగా పలువురు మంత్రులు, టీడీపీ నేతలు కౌంటర్ సెటైర్లు వేశారు. దీంతో వారి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ భూసేకరణకు వ్యతిరేకత […]

ఆదివారం రాజధాని ప్రాంతంలో పవన్‌ పర్యటన!
X
జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కార్యరంగంలోకి దూకుతున్నారు. ఆదివారం ఆయన ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. నవ్యాంధ్ర రాజధానికి రైతుల నుంచి బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న ఆయన ఈ అంశంపై ఇప్పటికే పలు మార్లు ట్వీట్ల ద్వారా ప్రభుత్వానికి తన అభిప్రాయాన్ని తెలిపారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోగా పలువురు మంత్రులు, టీడీపీ నేతలు కౌంటర్ సెటైర్లు వేశారు. దీంతో వారి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ భూసేకరణకు వ్యతిరేకత వ్యక్తమవుతున్న పెనుమాకలో పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇప్పటికే తన అనుచరులను పవన్ పంపారు. అయితే రాజధాని ప్రాంతంలో పర్యటనకు ముందు హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అవుతారు. వీరిద్దరి సంభాషణల్లో ఒకరి అభిప్రాయాలను ఒకరు
First Published:  22 Aug 2015 12:38 PM IST
Next Story