త్వరలో టీడీపీ కేంద్ర కమిటీ
తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ త్వరలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు విజయవాడలో జరిగిన టీడీపీ ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కమిటీని నియమించే అధికారాన్ని సీఎం చంద్రబాబుకు అప్పగించారు. 25న ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో ప్రత్యేక హోదా, విభజన బిల్లులో పెట్టిన అంశాలపై మాట్లాడాలని చంద్రబాబును ఈ సమావేశం కోరింది. ఈనెల 25న ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు చెప్పారు. అవినీతికి పాల్పడే నేతలే అవినీతి గురించి […]
BY Pragnadhar Reddy21 Aug 2015 7:26 PM IST
Pragnadhar Reddy Updated On: 22 Aug 2015 6:04 PM IST
తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ త్వరలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు విజయవాడలో జరిగిన టీడీపీ ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కమిటీని నియమించే అధికారాన్ని సీఎం చంద్రబాబుకు అప్పగించారు. 25న ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో ప్రత్యేక హోదా, విభజన బిల్లులో పెట్టిన అంశాలపై మాట్లాడాలని చంద్రబాబును ఈ సమావేశం కోరింది. ఈనెల 25న ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు చెప్పారు. అవినీతికి పాల్పడే నేతలే అవినీతి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఆరోపించారు. రాజధాని భూములపై రచ్చ చేసేవారు అసలు రాజధానే లేకుండా ఏపీని విభజించిన వారేనని మరిచిపోవద్దని ఆయన అన్నారు.
Next Story