Telugu Global
Others

భూసేకరణపై పవన్‌వి అపోహలే: బొండా ఉమా

రాజధాని భూసేకరణపై పవన్‌కల్యాణ్ అపోహ పడవద్దని టీడీపీ ఎమ్మెల్మే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 95 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, ఐదు శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అందుకే భూసేకరణ చట్టం తీసుకురావాల్సి వచ్చిందన్నారు. అక్కడక్కడా ఐలండ్‌లా మిగిలిపోయిన భూములను స్వాధీనం చేసుకోకపోతే నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన అన్నారు. అవసరమైతే పవన్‌ను కలిసి పరిస్థితిని వివరిస్తామని బొండా ఉమా తెలిపారు. ప్యాకేజీపై చర్చలకు ఢిల్లీకి ఆర్థికశాఖ కార్యదర్శి వెళ్లారు ఆయన తెలిపారు.

First Published:  21 Aug 2015 7:16 PM IST
Next Story