బాహుబలి 2 కి రాజమౌళీ కొత్త ఎత్తుగడ...
ఎప్పొడొచ్చాం అన్నది కాదు. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే రాజమౌళి మైండ్ సెట్ . ఒక ప్రాంతీయ భాష చిత్రంలో ఓ భారీ బడ్జెట్ ఫిల్మ్ ను ప్రారంభించి.. మార్కెట్ పరంగా కూడా కొత్త డిస్కవరీలు చేసి .. తన సమకాలీన దర్శకులకు ఒక గైడ్ గా నిలిచాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ తో రాజమౌళి ఈ ఫీట్స్ అన్ని చాల పరఫెక్ట్ గా చేశాడు. రెండు వందలకు పైగా బడ్జెట్ పెట్టిన సినిమాకు కేవలం ఆడియో […]
ఎప్పొడొచ్చాం అన్నది కాదు. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే రాజమౌళి మైండ్ సెట్ . ఒక ప్రాంతీయ భాష చిత్రంలో ఓ భారీ బడ్జెట్ ఫిల్మ్ ను ప్రారంభించి.. మార్కెట్ పరంగా కూడా కొత్త డిస్కవరీలు చేసి .. తన సమకాలీన దర్శకులకు ఒక గైడ్ గా నిలిచాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ తో రాజమౌళి ఈ ఫీట్స్ అన్ని చాల పరఫెక్ట్ గా చేశాడు. రెండు వందలకు పైగా బడ్జెట్ పెట్టిన సినిమాకు కేవలం ఆడియో విడుదల వేడకకు పెట్టిన ఖర్చు తప్ప.. బాహుబలి ప్రచారం కోసం ఆయన ఒక్క రూపాయి పెట్టలేదు. దీనికి బదులుగా సోషల్ నెట్ వర్క్ ను మ్యాగ్జిమమ్ వాడుకున్నారు.
సినిమా ఒక ఎపిక్ ఫిల్మ్ కావడంతో.. సోషల్ నెట్ వర్క్ లో ఫాలోవర్స్ సంఖ్య లక్షల్లో చేరింది. ఈ మధ్య నే బాహుబలి ఫ స్ట్ పార్ట్ తో ఓపెన్ చేసిన ఫేస్ బుక్ ఎకౌంట్ పేజి లైక్స్ 2 మిలియన్స్ దాటింది. ఈ సందర్భంగా లైక్ కొట్టిన వారిందిరికి రాజమౌళి ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక కలెక్షన్ల పరంగా బాహుబలి ఫస్ట్ పార్ట్ 500 వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం చేసింది.
కట్ చేస్తే బాహుబలి కన్ క్లూజన్ పార్ట్ తో వస్తున్న సెకండ్ పార్ట్ బడ్జెట్ పెరుగనుందనే వార్త ఒకటి ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తుంది. రెండు పార్ట్ లకు కలిపి నిర్మాతలు 250 కోట్లు పరిమితి పెట్టుకున్నారనేది ఇప్పటి వరకు వున్న సమాచారం. అయితే మొదటి పార్ట్ రాజమౌళి ఊహించిన దానికంటే పది రెట్లు ఘన విజయం .. ప్లస్ క్రేజ్ సంపాదించింది. దీంతో సెకండ్ పార్ట్ ను ప్రిస్టిజియస్ గా తీసుకుంటున్నాడని తెలుస్తుంది. సెకండ్ పార్ట్ లో హాలీవుడ్ ఆర్టిస్ట్ ల్ని కొందర్ని తీసుకుని .. సినిమాను హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారని వినికిడి. దీంతో బడ్జెట్ మరో 2 వందల కోట్లు పెరిగే అవకాశం ఉందనే వార్త హల్ చల్ చేస్తుంది. మొత్తం మీద సెకండ్ పార్ట్ కు అప్పుడే బాహుబలి కేప్టన్ రాజమౌళి ప్రచారం ప్రారంభించేశాడంటున్నారు పరిశీలకులు. అసలు సినిమా ప్రచారం అనేది రాజమౌళిని చూసి తెలుసుకోవాలి మరి.!.