పవన్ అంటే... నాగబాబుకు మండింది..!
ఏదైనా పెరుగుట విరుగట కొరకే అంటారు. చిరంజీవి అనే నటుడు లేక పోతే.. ఆ స్కూల్ నుంచి వచ్చిన దాదాపు 8 మంది హీరోల కు ప్లాట్ ఫామ్ లేదు. అన్నయ్య నిర్మించిన ప్లాట్ ఫామ్ మీద లాంచ్ అయిన పవన్ కళ్యాణ్ .. అనతికాలంలోనే తనదంటూ ఒక స్టైల్ ఏర్పరచుకుని.. యూత్ ఐకాన్ గా ఎదిగారు. అయితే చిరంజీవితో పాటు ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇంత వరకు బాగానే ఉంది . కానీ. మెగా […]
ఏదైనా పెరుగుట విరుగట కొరకే అంటారు. చిరంజీవి అనే నటుడు లేక పోతే.. ఆ స్కూల్ నుంచి వచ్చిన దాదాపు 8 మంది హీరోల కు ప్లాట్ ఫామ్ లేదు. అన్నయ్య నిర్మించిన ప్లాట్ ఫామ్ మీద లాంచ్ అయిన పవన్ కళ్యాణ్ .. అనతికాలంలోనే తనదంటూ ఒక స్టైల్ ఏర్పరచుకుని.. యూత్ ఐకాన్ గా ఎదిగారు. అయితే చిరంజీవితో పాటు ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇంత వరకు బాగానే ఉంది . కానీ. మెగా హీరోల ఏ ఫంక్షన్ జరిగినా..పవన్ అభిమానులు ..పవన్ పవన్ అంటూ అరవడం పరిపాటి అయిపోయింది. ఎదురుగా వున్న వారిని వదిలేసి. ఫంక్షన్ కు రానీ పవన్ కళ్యాణ్ గురించి కేకలు పెడుతుందటం అనేది ఇబ్బిందిగా మారింది.
ఇక తాజాగా మెగాస్టార్ చిరు బర్త్ డే వేడుకల్లో ఇదే తంతు జరిగింది. దీంతో నాగబాబుకు కోపం వచ్చింది. దమ్ముంటే మీరే పవన్ కళ్యాణ్ ఇంటికి పిలవండి. మీరే ఆయన అఫీస్‌కు వెళ్లి పిలవండి.. ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్‌ను రమ్మని పిలిచామో మీకు తెలుసా..? అంటూ పవన్ కోసం కేకలు పెట్టిన ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు. నాగబాబు ఆవేశంగా మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స ను హర్ట్ చేశాయంటున్నారు. అయితే మెగా వారిది ఏ ఫంక్షన్ జరిగిన ఇలా ఎదురుగా వున్న చిరంజీవి, రాంచరణ్, బన్నీ, నాగబాబుల్ని వదిలేసి.. పవన్ పవన్ అంటూ అవరడం సమంజసం కాదు కదా..! సో నాగబాబు అగ్రహానికి ఒక మంచి కారణమే ఉంది మరి.!