ఓటు తప్పనిసరిపై గుజరాత్ హైకోర్టు స్టే
గుజరాత్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఓటు తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఓటు హక్కు కల్గిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ హక్కు వినియోగించుకోవాలని, లేని పక్షంలో రూ.100 జరిమానా చెల్లించాలని ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యంగ విరుద్దంగా ఉన్నాయని ఓ వ్యక్తి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీన్ని విచారించిన […]
BY sarvi21 Aug 2015 6:36 PM IST
X
sarvi Updated On: 22 Aug 2015 7:27 AM IST
గుజరాత్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఓటు తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఓటు హక్కు కల్గిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ హక్కు వినియోగించుకోవాలని, లేని పక్షంలో రూ.100 జరిమానా చెల్లించాలని ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యంగ విరుద్దంగా ఉన్నాయని ఓ వ్యక్తి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పిటిషినర్ అభిప్రాయంతో ఏకీభవించి ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. హైకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించగా, ఓటు వినియోగం తప్పనిసరిపై తుది వరకూ న్యాయపోరాటం చేస్తామని ఆ రాష్ట్ర మంత్రి నితిన్ పటేల్ వ్యాఖ్యానించారు.
Next Story