గ్రీస్ ప్రధాని రాజీనామా
గ్రీస్ ప్రధాని సిప్రాస్ తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు ప్రొకోపిస్ పావ్‌లోపౌలస్ను కలిసి ఆయన రాజీనామాను సమర్పించారు. పొదుపు చర్యలను వ్యతిరేకిస్తాననే హామీతో సిరిజా పార్టీ అధ్యక్షుడు సిప్రాస్ ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన పొదుపు చర్యలను వ్యతిరేకించలేక పోవడంతోపాటు రుణదాతల షరతులకు లొంగిపోయారు. యూరోజోన్ నుంచి నిష్ర్కమించకుండా ఉండేందుకు మూడో ఉద్దీపనకు అంగీకరించి పార్లమెంటు ఆమోదం పొందారు. అయితే, సిప్రాస్ తీసుకున్న నిర్ణయాన్ని సొంతపార్టీ ఎంపీలు సైతం విబేధించారు. 25 […]
BY sarvi21 Aug 2015 6:38 PM IST
X
sarvi Updated On: 22 Aug 2015 7:33 AM IST
గ్రీస్ ప్రధాని సిప్రాస్ తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు ప్రొకోపిస్ పావ్‌లోపౌలస్ను కలిసి ఆయన రాజీనామాను సమర్పించారు. పొదుపు చర్యలను వ్యతిరేకిస్తాననే హామీతో సిరిజా పార్టీ అధ్యక్షుడు సిప్రాస్ ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన పొదుపు చర్యలను వ్యతిరేకించలేక పోవడంతోపాటు రుణదాతల షరతులకు లొంగిపోయారు. యూరోజోన్ నుంచి నిష్ర్కమించకుండా ఉండేందుకు మూడో ఉద్దీపనకు అంగీకరించి పార్లమెంటు ఆమోదం పొందారు. అయితే, సిప్రాస్ తీసుకున్న నిర్ణయాన్ని సొంతపార్టీ ఎంపీలు సైతం విబేధించారు. 25 మంది ఎంపీలు పార్టీ వీడి వెళ్లారు. దీంతో తన నిర్ణయానికి ప్రజలు మద్దతు పొందాలని భావించిన సిప్రాస్ తన పదవికి రాజీనామా చేశారు. సాధ్యమైనంత త్వరలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిందిగా అధ్యక్షుడిని కోరారు. అయితే, సిప్రాస్ మధ్యంతర ఎన్నికల్లో ప్రయోజనాలు పొందడానికే రాజీనామా చేశారని ఆయన ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు.
Next Story