నాలుగేళ్లలో 30 లక్షల మరుగుదొడ్లు
రాబోయే నాలుగేళ్లలో సుమారు 30 లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) పధకం ద్వారా 30 లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించనుంది. అందుకోసం ఓక్కో యూనిట్ రూ. 12,500 చొప్పున మంజూరు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించినన సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 45 లక్షల కుటుంబాల్లో 33.34 లక్షల కుటుంబాలకు మరగుదొడ్లు లేవని గుర్తించింది. ఈ పథకం కోసం వచ్చే నాలుగేళ్లలో కేంద్ర, రాష్ట్ర […]
BY sarvi21 Aug 2015 6:44 PM IST
X
sarvi Updated On: 22 Aug 2015 8:29 AM IST
రాబోయే నాలుగేళ్లలో సుమారు 30 లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) పధకం ద్వారా 30 లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించనుంది. అందుకోసం ఓక్కో యూనిట్ రూ. 12,500 చొప్పున మంజూరు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించినన సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 45 లక్షల కుటుంబాల్లో 33.34 లక్షల కుటుంబాలకు మరగుదొడ్లు లేవని గుర్తించింది. ఈ పథకం కోసం వచ్చే నాలుగేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ. 3,671 కోట్లు ఖర్చు చేయనున్నాయి. అందులో కేంద్రం వాటా 75 శాతం కాగా, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Next Story