దోపిడీ సూత్రధారి బిగ్ సీ మేనేజర్: సీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్ నగరంలో పట్టపగలు దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల కేసులో ప్రధాన సూత్రధారి బిగ్‌సీ మేనేజర్ సమీయుద్దీన్ అని సీపీ మహేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. పోలీసులకు పట్టుబడిన గుల్బర్గా వాసి మీర్జా మహమ్మద్ అబ్దుల్లాబేగ్ అలియాస్ ఫహీమ్ మీర్జాకు ఏడేళ్ల క్రితం టోలిచౌకివాసి బిగ్‌సి మేనేజర్‌గా పని చేస్తున్న సమీయుద్దీన్‌తో పరిచయం ఏర్పడింది. బిగ్‌సీలో ప్రతిరోజూ లక్షలాది రూపాయల వ్యాపారం జరగడం గమనించిన సమీయుద్దీన్ ఫోన్ ద్వారా మీర్జా మహమ్మద్ అబ్దుల్లాబేగ్‌కు సమాచారం పంపాడు. మీర్జా […]
BY sarvi21 Aug 2015 1:11 PM GMT
X
sarvi Updated On: 22 Aug 2015 2:17 AM GMT
హైదరాబాద్ నగరంలో పట్టపగలు దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల కేసులో ప్రధాన సూత్రధారి బిగ్‌సీ మేనేజర్ సమీయుద్దీన్ అని సీపీ మహేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. పోలీసులకు పట్టుబడిన గుల్బర్గా వాసి మీర్జా మహమ్మద్ అబ్దుల్లాబేగ్ అలియాస్ ఫహీమ్ మీర్జాకు ఏడేళ్ల క్రితం టోలిచౌకివాసి బిగ్‌సి మేనేజర్‌గా పని చేస్తున్న సమీయుద్దీన్‌తో పరిచయం ఏర్పడింది. బిగ్‌సీలో ప్రతిరోజూ లక్షలాది రూపాయల వ్యాపారం జరగడం గమనించిన సమీయుద్దీన్ ఫోన్ ద్వారా మీర్జా మహమ్మద్ అబ్దుల్లాబేగ్‌కు సమాచారం పంపాడు. మీర్జా తన ఇద్దరు స్నేహితులతో కలిసి గుల్బర్గా నుంచి వచ్చి సమీయుద్దీన్ ఇంట్లో మకాం వేశాడు. వెస్ట్‌జోన్ పోలీసులకు ఇద్దరు దొంగలు బిగ్‌సీ ముందు రెక్కీ నిర్వహిస్తున్నారనే సమాచారం అందడంతో రంగంలోకి దిగి దుండుగులను అరెస్ట్ చేశారని ఆయన వివరించారు. ఉద్యోగులే దోపిడీలకు పథకాలు వేస్తుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story