బ్లూస్టార్ కొత్త ప్లాంట్ తెలుగు రాష్ట్రాల్లోనే ...
బ్లూస్టార్ సంస్థ కొత్తగా రూపొందించిన ఇన్వెర్టర్ వేరియబుల్ రిఫ్రిజిరేటర్ ( విఆర్ఎఫ్)ను హైదరాబాద్‌లో ఆసంస్థ ప్రెసిడెంట్ త్యాగరాజన్ విడుదల చేశారు. ఈ ఏసీలు న్యూ జనరేషన్ ఇన్వెర్టర్ ఏసీలని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ కోరుకున్నట్టుగా తమ సంస్థ ఈ ఏసీలను నూటికి నూరు శాతం దేశీయంగా రూపొందించిందని ఆయన చెప్పారు. దేశంలో ఏసీలు, ఫ్రిజ్‌ల తయారీలో అగ్రగామిగా నిలిచిన తమ సంస్థ కొత్త ప్లాంటును తెలుగు రాష్ట్రాల్లోనే నెలకొల్పాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రా, తెలంగాణల్లో ఎక్కడ […]
BY sarvi21 Aug 2015 6:40 PM IST
X
sarvi Updated On: 22 Aug 2015 7:42 AM IST
బ్లూస్టార్ సంస్థ కొత్తగా రూపొందించిన ఇన్వెర్టర్ వేరియబుల్ రిఫ్రిజిరేటర్ ( విఆర్ఎఫ్)ను హైదరాబాద్‌లో ఆసంస్థ ప్రెసిడెంట్ త్యాగరాజన్ విడుదల చేశారు. ఈ ఏసీలు న్యూ జనరేషన్ ఇన్వెర్టర్ ఏసీలని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ కోరుకున్నట్టుగా తమ సంస్థ ఈ ఏసీలను నూటికి నూరు శాతం దేశీయంగా రూపొందించిందని ఆయన చెప్పారు. దేశంలో ఏసీలు, ఫ్రిజ్‌ల తయారీలో అగ్రగామిగా నిలిచిన తమ సంస్థ కొత్త ప్లాంటును తెలుగు రాష్ట్రాల్లోనే నెలకొల్పాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రా, తెలంగాణల్లో ఎక్కడ స్ధాపించాలనే అంశంపై మరో రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
Next Story