కేసీఆర్ పోకడలతో ప్రాజెక్టుల వ్యయ భారం: అఖిలపక్ష నేతలు
నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడల వల్లనే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోందని అఖిలపక్ష నేతలు విమర్శించారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో వామపక్షాల ఆధ్వర్యంలో దుర్గంగుట్ట-కంతనపల్లి ప్రాజెక్టులపై అఖిలపక్షనేతల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న నేతలు ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్షధోరణిపై మండిపడ్డారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.38,500 కోట్ల అంచన వ్యయంతో ప్రాజెక్టును ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో […]
BY sarvi21 Aug 2015 6:37 PM IST
sarvi Updated On: 22 Aug 2015 7:29 AM IST
నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడల వల్లనే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోందని అఖిలపక్ష నేతలు విమర్శించారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో వామపక్షాల ఆధ్వర్యంలో దుర్గంగుట్ట-కంతనపల్లి ప్రాజెక్టులపై అఖిలపక్షనేతల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న నేతలు ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్షధోరణిపై మండిపడ్డారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.38,500 కోట్ల అంచన వ్యయంతో ప్రాజెక్టును ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ. 1500 కోట్లు కేటాయించారు. అయితే, సీఎం ఇప్పుడు ప్రాణహిత డిజైన్ మార్చడం వల్ల నిర్మాణ ఖర్చు రూ. 45 వేల కోట్లకు పెరుగుతోందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. తెలంగాణలో చాలా ప్రాజెక్టులు 50 శాతం నిర్మాణం పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి వాటికోసం నిధులు కేటాయించకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి పూను కోవడం సరికాదని, కంతనపల్లి ప్రాజెక్టు డిజైన్ మారిస్తే ఉద్యమం చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీటీడీపీ నేతలతో పాటు వామపక్షాల, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.
Next Story