Telugu Global
Others

Wonder World 2

ప్రపంచంలో అతి ప్రాచీన రాజవంశం జపాన్‌ రాజవంశం. పదిహేను వందల సంవత్సరాల నించీ ఒకే రాజవంశం జపాన్‌ని పాలించింది. క్రీ॥శ॥ ఆరవ శతాబ్దం నుండి ఒకే కుటుంబం నుండి వచ్చిన రాజులు జపాన్‌ని పాలించారు. ఇప్పుడు జపాన్‌ రాజు ‘అకిహిటో’, ఆ వంశంలోని 125వ రాజు. ప్రజాస్వామ్యమున్నా జపాన్‌ రాజును జపాన్‌ ప్రజలు గౌరవిస్తారు *** 1600 ప్రాంతంలో సర్‌ వాల్టర్‌ రాలే పొగాకుని ఇంగ్లాండుకు పరిచయం చేశారు. ఒకటవ జేమ్స్‌ రాజు పొగాకు ఉపయోగాన్ని వ్యతిరేకిస్తూ ఒక […]

ప్రపంచంలో అతి ప్రాచీన రాజవంశం జపాన్‌ రాజవంశం. పదిహేను వందల సంవత్సరాల నించీ ఒకే రాజవంశం జపాన్‌ని పాలించింది. క్రీ॥శ॥ ఆరవ శతాబ్దం నుండి ఒకే కుటుంబం నుండి వచ్చిన రాజులు జపాన్‌ని పాలించారు. ఇప్పుడు జపాన్‌ రాజు ‘అకిహిటో’, ఆ వంశంలోని 125వ రాజు. ప్రజాస్వామ్యమున్నా జపాన్‌ రాజును జపాన్‌ ప్రజలు గౌరవిస్తారు

***

1600 ప్రాంతంలో సర్‌ వాల్టర్‌ రాలే పొగాకుని ఇంగ్లాండుకు పరిచయం చేశారు. ఒకటవ జేమ్స్‌ రాజు పొగాకు ఉపయోగాన్ని వ్యతిరేకిస్తూ ఒక ‘బుక్‌లెట్‌’ రాశాడు. పొగతాగడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం చేసిన మొదటి ప్రయత్నం ఘోరంగా విఫల మయింది. (ఇప్పట్లాగే) వెంటనే ఆ అలవాటు దేశమంతా అల్లుకుంది.

***

ధ్నాలుగవ లూయీ నాట్యాభిమాని. తన పదమూడో ఏట నుండి నాట్యమన్నా, నృత్య రూపకాలన్నా చాలా ఇష్టపడేవాడు. తను మరీ వృద్ధుడు కాకముందు దాదాపు ముప్పయి నృత్య రూపకాలలో భాగస్వామ్యం వహించి నృత్య ప్రదర్శనలు చేశాడు. వాటికి జీన్‌ బాప్టిస్ట్‌ లల్లీ సంగీతం సమకూర్చాడు.

***

రోమన్‌ చక్రవర్తి ఐదవ ఛార్లెస్‌ నేను దేవుడితో స్పానిష్‌లో మాట్లాడతాను, స్త్రీతో ఇటాలియన్‌ భాషలో మాట్లాడతాను, మొగవాళ్ళతో ఫ్రెంచిలో మాట్లాడుతాను, గుర్రాలతో జర్మనీలో మాట్లాడతాను, అనేవాడట.

***

జార్‌ పీటర్‌ 3 రష్యాని ఆరు నెలలు పాలించాడు. భార్య తరఫున కుట్రదారులు 1762లో అతన్ని చంపేశారు. అప్పటికి అతని వయసు ముప్పయి నాలుగు. చిత్రమేమిటంటే అప్పటికి అతనికి చక్రవర్తిగా అభిషేకం జరగలేదు. అతను చనిపోయిన ముప్పయి అయిదు సంవత్సరాల తర్వాత అతనికి చక్రవర్తిగా అభిషేకం చేశారు. దానికోసం అతని శవపేటిక తెరిచారు.

First Published:  20 Aug 2015 6:34 PM IST
Next Story