భూసేకరణను పవన్‌కల్యాణ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడంటే...?
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని భూముల సేకరణను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? ప‌్రభుత్వంతో ఢీ కొట్టినట్టు ఎందుకు మాట్లాడుతున్నాడు? నిజంగానే రైతుల భూములు పోతున్నాయని పవన్ బాధపడుతున్నాడా? ఇపుడు అందరి మదిలోనూ ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూ సమీకరణ సందర్భంగా కూడా పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాలలో పర్యటించాడు. సమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులకు అండగా నిలబడ్డాడని అంతా భావించారు. కానీ అపుడు పవన్ రాజధాని గ్రామాలలో తిరగడానికి, ఇపుడు భూ సమీకరణను వ్యతిరేకించడానికి కారణమేమిటన్న విషయం […]
BY Pragnadhar Reddy21 Aug 2015 5:18 AM IST
X
Pragnadhar Reddy Updated On: 21 Aug 2015 5:49 AM IST
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని భూముల సేకరణను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? ప‌్రభుత్వంతో ఢీ కొట్టినట్టు ఎందుకు మాట్లాడుతున్నాడు? నిజంగానే రైతుల భూములు పోతున్నాయని పవన్ బాధపడుతున్నాడా? ఇపుడు అందరి మదిలోనూ ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూ సమీకరణ సందర్భంగా కూడా పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాలలో పర్యటించాడు. సమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులకు అండగా నిలబడ్డాడని అంతా భావించారు. కానీ అపుడు పవన్ రాజధాని గ్రామాలలో తిరగడానికి, ఇపుడు భూ సమీకరణను వ్యతిరేకించడానికి కారణమేమిటన్న విషయం గురించి మీడియా వారు శోధించగా ఆసక్తికర విషయమొకటి బయటపడింది. పవన్ ముఖ్యంగా ఓ మూడు గ్రామాలలోని రైతుల కోసమే ఇలా బహిరంగంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఢీకొంటున్నాడంట. ఆ మూడు గ్రామాలలోనే గతంలో కూడా పర్యటించాడు. ఇపుడు కూడా ఆ మూడు గ్రామాల రైతుల కోసమే భూ సేకరణను వ్యతిరేకిస్తున్నాడు. ఆమూడు.. బేతపూడి, పెనుమాక, ఉండవల్లి గ్రామాలు. ఈ మూడు గ్రామాలలో ఉన్నవారంతా పవన్ కల్యాణ్ అభిమానులే. అంతేకాదు పవన్ సామాజిక వర్గం వారే కావడం విశేషం. గతంలో సమీకరణ సమయంలో ఈ గ్రామాలలోని యువకులు పవన్‌ను కలుసుకుని గట్టిగా నిలదీశారని సమాచారం. ఈ ఊళ్లలో పవన్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కూడా కట్టి హడావిడి చేశారు. మీరు చెప్పినవారికి ఓట్లేసి గెలిపిస్తే మమ్మల్నిలా నట్టేట్లో వదిలేస్తారా అని ఆ గ్రామాలవారు పవన్‌ను నిలదీసిన తర్వాతే ఆయన ఆ గ్రామాలకు వెళ్లాడని, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడని తెలుస్తోంది. అపుడు సమీకరణను తప్పించుకున్న ఈ మూడు గ్రామాలపై ఇపుడు భూసేకరణ కత్తి వేలాడుతోంది. అందుకే పవన్ మరలా గొంతు సవరించుకున్నాడు. ఇష్టం లేకుండా భూ సేకరణ వద్దని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాడు. అయితే ఈ సలహాలను వినే పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఎంతమాత్రమూ లేదు. ఇప్పటికే మంత్రులు పవన్‌పై సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు, ఆయన సహచర మంత్రులు పవన్‌ను ఓ జోకర్‌లా భావిస్తున్నారని జనానికి కూడా అర్ధమైపోయింది. ఇటు సొంత సామాజిక వర్గానికి న్యాయం చేయలేక, అటు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేక పవన్ తలపట్టుకుని కూర్చున్నాడని వినిపిస్తోంది.
Next Story