Telugu Global
Others

బ‌స్సు చార్జీల బాదుడుపై ఏపీ రూట్లో తెలంగాణ 

బ‌స్సు ప్ర‌యాణీకుల‌పై రెండు రాష్ట్రాల్లోనూ స‌మాన భారం ప‌డ‌నుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌స్సు చార్జీల‌ను  ఎంత శాతం పెంచితే, తెలంగాణ‌లోనూ అదే స్థాయిని నిర్ణ‌యించాల‌ని టీఎస్ఆర్టీసీ అధికారులు ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాదించ‌నున్నారు. బ‌స్సు చార్జీల పెంపు నిర్ణ‌యంతో ప్ర‌యాణీకుల‌పై అద‌నంగా 12 నుంచి 15 శాతం భారం ప‌డే అవ‌కాశ‌ముంది. ఆర్టీసీకి గ‌తంలో కంటే ఈ ఏడాది న‌ష్టాలు త‌గ్గిన‌ప్ప‌టికీ  ఆర్టీసీ ఉద్యోగుల‌కు భారీగా జీతాలు పెంచ‌డం వ‌ల్ల సంస్థ న‌ష్టాల్లో ప‌డింది. సుమారు 62 కోట్ల రూపాయ‌ల న‌ష్ట […]

బ‌స్సు చార్జీల బాదుడుపై ఏపీ రూట్లో తెలంగాణ 
X
బ‌స్సు ప్ర‌యాణీకుల‌పై రెండు రాష్ట్రాల్లోనూ స‌మాన భారం ప‌డ‌నుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌స్సు చార్జీల‌ను ఎంత శాతం పెంచితే, తెలంగాణ‌లోనూ అదే స్థాయిని నిర్ణ‌యించాల‌ని టీఎస్ఆర్టీసీ అధికారులు ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాదించ‌నున్నారు. బ‌స్సు చార్జీల పెంపు నిర్ణ‌యంతో ప్ర‌యాణీకుల‌పై అద‌నంగా 12 నుంచి 15 శాతం భారం ప‌డే అవ‌కాశ‌ముంది. ఆర్టీసీకి గ‌తంలో కంటే ఈ ఏడాది న‌ష్టాలు త‌గ్గిన‌ప్ప‌టికీ ఆర్టీసీ ఉద్యోగుల‌కు భారీగా జీతాలు పెంచ‌డం వ‌ల్ల సంస్థ న‌ష్టాల్లో ప‌డింది. సుమారు 62 కోట్ల రూపాయ‌ల న‌ష్ట భారాన్ని త‌గ్గించేందుకు టికెట్ల ధ‌ర‌లు పెంచ‌క త‌ప్ప‌ద‌ని జేఎండీ ర‌మ‌ణారావు, ఇత‌ర ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప‌ల్లెవెలుగు బ‌స్సుల నిర్వ‌హ‌ణ వ‌ల‌న సంస్థ‌కు క‌లుగుతున్న న‌ష్టాల‌ను ఎక్స్‌ప్రెస్‌, డీల‌క్స్‌, ల‌గ్జ‌రీ బ‌స్సుల ద్వారా స‌ర్దుబాటు చేయాల‌ని ఇందుకోసం ఆ కేట‌గిరీ బ‌స్సుల ఆక్యుపెన్సీ రేషియో ( ఓఆర్‌) త‌గ్గ‌కుండా చూడాల‌ని జేఎండీ అధికారులను ఆదేశించారు.
First Published:  20 Aug 2015 6:41 PM IST
Next Story