ఇరకాటంలో విద్యుత్ ఉద్యోగులు
ఉమ్మడి రాష్ట్ర విభజన కారణంగా 1253 మంది విద్యుత్ ఉద్యోగులు భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఆంధ్రాకు వెళ్లాల్సిందిగా రెండు నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఈ ఉద్యోగులను రిలీవ్ చేసింది. అయితే, ఆంధ్రా ప్రభుత్వం వారికి వేతనాలు ఇవ్వలేక విధుల్లోకి చేర్చుకోవడం లేదు. దీంతో వారి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. వీరికి రెండు నెలలుగా జీతాలు కూడా అందడం లేదు. వాస్తవానికి తెలంగాణకు చెందిన 600 మంది ఉద్యోగులు ఆంధ్రాలో పని చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వారిని […]
BY sarvi20 Aug 2015 6:49 PM IST
sarvi Updated On: 21 Aug 2015 8:48 AM IST
ఉమ్మడి రాష్ట్ర విభజన కారణంగా 1253 మంది విద్యుత్ ఉద్యోగులు భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఆంధ్రాకు వెళ్లాల్సిందిగా రెండు నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఈ ఉద్యోగులను రిలీవ్ చేసింది. అయితే, ఆంధ్రా ప్రభుత్వం వారికి వేతనాలు ఇవ్వలేక విధుల్లోకి చేర్చుకోవడం లేదు. దీంతో వారి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. వీరికి రెండు నెలలుగా జీతాలు కూడా అందడం లేదు. వాస్తవానికి తెలంగాణకు చెందిన 600 మంది ఉద్యోగులు ఆంధ్రాలో పని చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వారిని రిలీవ్ చేసి తెలంగాణ నుంచి రిలీవ్ అయిన 1253 మంది విద్యుత్ ఉద్యోగులను చేర్చుకోవాల్సి ఉంది. అయితే రిలీవ్ అవుతున్న వారికి రెట్టింపు సంఖ్య ఉద్యోగులను విధుల్లోకి చేర్చుకోవడం వల్ల వారి వేతనాలను భరించలేమని ఏపీ ప్రభుత్వం వారిని రావద్దని చెబుతోంది. ప్రస్తుతానికి వీరి భవిష్యత్ కోర్టు విచారణల్లో ఉంది. మరి ఫలితం ఎప్పుడు తేలనుందో.
Next Story