రైలులో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
పెను ప్రమాదం తప్పింది. బీహార్‌లోని ప్రయాణికులతో వెళుతున్న రైలు నుంచి పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రాంచీ-పశ్చిమబెంగాల్ రైలులో పోలీసులు పేలుడు పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. పేలుడు పదార్థాల్లో ఆర్డీఎక్స్ తోపాటు డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్, బాంబులున్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో జార్ఖండ్ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీటిని దేనికి ఉద్దేశించి రవాణా చేస్తున్నారో ఇంకా తెలియరాలేదు.
BY Pragnadhar Reddy20 Aug 2015 6:38 PM IST
Pragnadhar Reddy Updated On: 21 Aug 2015 10:46 AM IST

Next Story