Telugu Global
Others

మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల్లో మూడో స్థానంలో తెలంగాణ‌  

స్త్రీల‌ను అవ‌మానించ‌డం, వేధించ‌డం, వారిపై అఘాయిత్యాల‌కు పాల్ప‌డ‌డంలో తెలంగాణ‌కు దేశంలోనే మూడ స్థానం ద‌క్కింది. అలాగే సైబ‌ర్ నేరాల్లో నాలుగో స్థానంలో ఉంద‌ని నేష‌న‌ల్ క్రైం రికార్డ్స్ బ్యూరో  (ఎన్సీఆర్‌బి)  నివేదిక‌లో వెల్ల‌డైంది. ఈ నివేదిక వెల్ల‌డించిన గ‌ణాంకాల ప్ర‌కారం రాష్ట్ర‌వ్యాప్తంగా గంట‌కు 14 నేరాలు, రోజుకు 24 మోసాలు జ‌రుగుతున్నాయి. 2014 సంవ‌త్స‌రంలో పోలీసుల‌కు 1,28,737 ఫిర్యాదులు అందాయి. వాటిని ప‌రిశీలించిన పోలీసులు 1,27,706 కేసులు న‌మోదు చేశారు. 1308 హ‌త్య కేసులు, 1159 హ‌త్యాయ‌త్నాం, […]

మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల్లో మూడో స్థానంలో తెలంగాణ‌  
X
స్త్రీల‌ను అవ‌మానించ‌డం, వేధించ‌డం, వారిపై అఘాయిత్యాల‌కు పాల్ప‌డ‌డంలో తెలంగాణ‌కు దేశంలోనే మూడ స్థానం ద‌క్కింది. అలాగే సైబ‌ర్ నేరాల్లో నాలుగో స్థానంలో ఉంద‌ని నేష‌న‌ల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్‌బి) నివేదిక‌లో వెల్ల‌డైంది. ఈ నివేదిక వెల్ల‌డించిన గ‌ణాంకాల ప్ర‌కారం రాష్ట్ర‌వ్యాప్తంగా గంట‌కు 14 నేరాలు, రోజుకు 24 మోసాలు జ‌రుగుతున్నాయి. 2014 సంవ‌త్స‌రంలో పోలీసుల‌కు 1,28,737 ఫిర్యాదులు అందాయి. వాటిని ప‌రిశీలించిన పోలీసులు 1,27,706 కేసులు న‌మోదు చేశారు. 1308 హ‌త్య కేసులు, 1159 హ‌త్యాయ‌త్నాం, ఆర్థిక నేరాల‌కు సంబంధించి 9,413 కేసులు, 703 సైబ‌ర్ నేరాల కేసులు న‌మోద‌య్యాయి. మ‌హిళ‌ల‌ను అవ‌మానించినందుకు 1,142 కేసులు, 620 లైంగిక వేధింపులు, 979 అత్యాచారం కేసులు న‌మోద‌య్యాయి. చిన్నారుల‌పై నేరాలు, కిడ్నాప్ ల్లో కూడా తెలంగాణ అగ్ర‌స్థానంలోనే ఉంది. గ‌తేడాది 708 మంది చిన్నారులు కిడ్నాప్‌కు గుర‌య్యారు. 588 మందిపై అత్యాచారాలు జ‌రిగాయి. 292 మంది బాలిక‌లు ప్రేమ పేరిట కిడ్నాప్‌కు గుర‌య్యారని ఎన్సీఆర్సీ తెలిపింది.
First Published:  20 Aug 2015 6:42 PM IST
Next Story