Telugu Global
Cinema & Entertainment

కిక్‌2 మూవీ రివ్యూ

రేటింగ్‌. 2.75/5 దర్శకత్వం : సురేందర్ రెడ్డి నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్ సంగీతం : ఎస్ఎస్ తమన్ సినిమాటోగ్ర‌ఫి:  మ‌నోజ్ ప‌ర‌మ హంస‌ నటీనటులు : రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం… మాస్ మహారాజ్ కెరీర్లో టాప్ 3 ఫిల్మ్‌లో ఒకటిగా చెప్పుకోదగిన సినిమా ‘కిక్’. 2009లో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ క్రేజీ మూవీకి చేసిన సీక్వెల్ ‘కిక్ 2′. రవితేజ కిక్ తర్వాత మరోసారి సురేందర్ రెడ్డితో కలిసి చేసిన ఈ […]

కిక్‌2 మూవీ రివ్యూ
X
రేటింగ్‌. 2.75/5
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్
సంగీతం : ఎస్ఎస్ తమన్
సినిమాటోగ్ర‌ఫి: మ‌నోజ్ ప‌ర‌మ హంస‌
నటీనటులు : రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం…
మాస్ మహారాజ్ కెరీర్లో టాప్ 3 ఫిల్మ్‌లో ఒకటిగా చెప్పుకోదగిన సినిమా ‘కిక్’. 2009లో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ క్రేజీ మూవీకి చేసిన సీక్వెల్ ‘కిక్ 2′. రవితేజ కిక్ తర్వాత మరోసారి సురేందర్ రెడ్డితో కలిసి చేసిన ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. టాలీవుడ్ గోల్డెన్ లెగ్ రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. మ‌రి ఎక్స్‌పెక్టేష‌న్స్ పెంచిన రేంజ్‌లో ఈ సినిమా ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం…
కథ :
‘కిక్ 2′ సినిమా కథ ‘కిక్’సినిమాకి కొనసాగింపుగా మొదలవుతుంది. మొద్దటి పార్ట్ లోని కిక్ అలియాస్ కళ్యాణ్(రవితేజ)–నైన(ఇలియానా)ల కుమారుడు రాబిన్ హుడ్(రవితేజ) కథే ఇది. అక్కడ కళ్యాణ్‌కి కిక్ కావాలి, ఇక్కడ మన రాబిన్ హుడ్ కి కంఫర్ట్ కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తనకి కంఫర్ట్ మిస్ అయితే పక్కనోడికి చుక్కలు చూపిస్తాడు, తనకి కంఫర్ట్ ఉన్నంత వరకూ పక్కన ఏం జరిగినా పట్టించుకోడు. ఇక కథలోకి వెళితే.. కిక్ పోలీస్ ఉద్యోగం మానేసి యుఎస్ లో సెటిల్ అవుతాడు. రాబిన్ హుడ్ అమ్మ కడుపులో కంఫర్ట్ లేదని 7 నెలలకే బయటకి వచ్చేస్తాడు. అలా భూమి మీదకి వచ్చినప్పటి నుంచి తన తండ్రిని కూడా కాదని, తన కంఫర్ట్ కోసం పక్కోడి ప్రాణాలతో పేకాడుకుంటూ పెరుగుతాడు. డాక్టర్ అయిన రాబిన్ హుడ్ ఓ హాస్పిటల్ కట్టాలనుకుంటాడు. దానికి ఇండియాలో తనకు ఉన్న ఆస్తులని అమ్మేసి డబ్బు తెచ్చుకోవాలని ఇండియాకి వస్తాడు. అలా వచ్చిన రాబిన్ హుడ్‌కి చైత్ర(రకుల్ ప్రీత్ సింగ్) పరిచయం అవుతుంది. కొద్ది రోజులకే చైత్ర రాబిన్ హుడ్ ప్రేమలో పడుతుంది. కానీ రాబిన్ హుడ్ మాత్రం తనని ప్రేమించడు. అత‌ను ప్రేమిస్తున్నాడ‌ని తెలుసుకునే స‌రికి హీరోయిన్ కిడ్నాప్ అవుతుంది. ఏకంగా స్టేట్ మారిపోతుంది. బీహార్‌లోని బిలాస్‌పూర్‌కు క‌థ షిఫ్ట్ అవుతుంది. అక్క‌డ సోల‌మాన్ సాంగ్ ఠ‌కూర్, అత‌ని కొడుకు మున్నలు అట‌విక దౌష్టికాలు చేస్తూ… గ్రామ జ్ర‌జ‌ల్ని హింసిస్తూ వాళ్లు ఆనందంగా జీవిస్తుంటారు. అయితే హీరోయిన్‌కు సంబంధించి కొన్ని సంఘ‌ట‌న‌ల కార‌ణంగా మ‌న రాబిన్ హుడ్ అలియాస్ ర‌వితేజా విల‌న్స్‌తో త‌లప‌డాల్సి వ‌స్తుంది. ఆ విల‌న్స్ నుంచి హీరోయిన్‌ను.. త‌న కంఫ‌ర్ట్‌ను ఎలా మ‌న రాబిన్‌హుడ్‌ కాపాడుకున్నాడు అనేది మీరు తెర‌పైన చూడాల్సిందే మ‌రి.
ప్లస్ పాయింట్స్ :
ఒక హిట్ అయిన సినిమా పేరుతో వ‌చ్చినా.. లేదా సీక్వెల్ చేసినా.. క‌చ్చితంగా అభిమానులు మొద‌టి భాగం కంటే బావుంటుంద‌నే ఆశిస్తారు. అలాగే మేక‌ర్స్ కూడా మెప్పించాల‌నే వ‌ర్కువుట్ చేస్తారు. కిక్ 2 చిత్రంలో రాబిన్ హుడ్ గా ర‌వితేజ త‌న శ‌క్తి మేర‌కు మెప్పించారు. క‌థ‌ను త‌న భుజ స్కాందాలపై మోసేస్తున్నాడు. ర‌కుల్ ప్రీతిసింగ్ ఈ చిత్రంలో గ్లామ‌ర్ తో పాటు..కాస్త అభిన‌యానికి స్కోప్ వున్న రోల్ ప‌డింది. బీహారీ అమ్మాయిగా ర‌కుల్ హండ్రెట్ ప‌ర్సెంట్ సెట్ అయ్యింది. మ‌న‌జో్ ప‌ర‌మ హంస సినిమాటోగ్ర‌ఫి కిక్ 2 చిత్రానికి ఒక పిల్ల‌ర్ అనే చెప్పాలి. వ‌క్కాంతం వంశం రాసిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ లో హీరో .. విల‌న్స్ తో పలికే సంభాష‌ణ‌లు కొన్ని ఆడియ‌న్స్ తో చ‌ప్ప‌ట్లు కొట్టిస్తాయి. ఇక ర‌వితేజ తో లాంగ్ టైమ్ నుంచి ట్రావెల్ అవుతున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ .. కిక్ 2 చిత్రానికి మంచి నేప‌థ్య సంగీతం ఇచ్చాడు. సాంగ్స్ విజువ‌ల్స్ ప‌రంగా బావున్నాయి. సాంగ్స్ లో ర‌వితేజ‌ను బాగా చూపించారు. ఓవ‌రాల్ గా ర‌వితేజ కొంత స‌న్న‌బ‌డి బాగా క‌నిపించారు. కొన్ని చోట్ల వ‌య‌సు తాలుకు ల‌క్ష‌ణాలు రిఫ్లెక్ట్ అయ్యాయి. 50 ఏళ్ల‌కు ద‌గ్గ‌ర‌గా వున్నాడు కాబ‌ట్టి..ఇంక నిత్య య‌వ్వ‌నుడిగా క‌నిపించాల‌ని కోరుకోవ‌టం రైట్ కాదు కాద‌నే విష‌యం ప్రేక్ష‌కుల‌కు తెలిసిందే.
ఆర్టిస్ట్ ల ప‌నితీరు..
రాబీన్ హుడ్ రోల్ లో ర‌వితేజ క్యారెక్ట‌రైజేష‌న్ మాస్ ఆడియ‌న్స్ ను మెప్పించే విధంగా డిజైన్ చేశారు. అదే రేంజ్ లో ర‌వితేజ పండించారు. హీరోయిన్ గ్లామ‌ర్ లుక్ లో ఆడియ‌న్స్ ను ఫిదా చేసింది. యాక్టింగ్ స్కోపో్ వున్న సెకండాఫ్ లో ప‌ర‌వాలేద‌ని పించింది. ఇక ప్ర‌థ‌మార్దంలో బ్ర‌హ్మానందం త‌న రోల్ హండ్రెట్ ప‌ర్సెంట్ పండించాడు. ఇక విలన్ గా కనిపించిన రవికిషన్ లుక్ ఎంత గంభీరంగా ఉందో, అంతే గంభీరమైన నటనని కనబరిచారు. రవితేజ చేసిన కంఫర్ట్ లాంటి పాత్రకి స్ట్రాంగ్ పోటీనిచ్చే పాత్రలో రవికిషన్ జీవించాడు. రవితేజ –రవికిషన్ –కబీర్ సింగ్ ల మధ్య వచ్చే చాలెంజింగ్ ఎపిసోడ్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని ఊపిరి బిగబట్టుకొని సీటు చివరన కూర్చొని ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. బాలీవుడ్ కమెడియన్స్ అయిన రాజ్పల్ యాదవ్, సంజయ్ మిశ్రాలు పరవాలేదనిపించారు. తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, కోవై సరళ లాంటి వారు తమ పాత్రలకు న్యాయం చేసారు. ఐటెం సాంగ్ లో నోర ఫతేహి అందాల అరబోతతో ముందు బెంచ్ వారిని బాగానే ఆకట్టుకుంది. ర‌వితేజ నుంచి అభిమానులు ఏం ఆశిస్తారో అదంత ఇవ్వ‌డానికి డైరెక్ట‌ర్ మ్యాగ్జిమ‌మ్ వ‌ర్కువుట్ చేశారు.
మైనస్ పాయింట్స్ :
‘కిక్ 2′ సినిమాలో చెప్పుకోదగిన ఒకటి రెండు మైనస్ పాయింట్స్ ఉన్నాయి.. మొదటగా చెప్పుకోవాల్సింది సెకండాఫ్‌లో ఎంటర్టైన్మెంట్ బాగా తక్కువ అవ్వడం. అలాగే సెకండాఫ్ మొదలైన 25 నిమిషాలు చాలా చాలా స్లోగా సాగడం. ఆ ఎపిసోడ్ చాలా బోరింగ్, దాన్ని ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. కిక్ సినిమాలో సీరియస్‌నెస్‌తో పాటు కామెడీ కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది. కానీ కిక్ 2 లో ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ అయినంతగా సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం మైనస్. దానివల్ల సెకండాఫ్‌లో అక్కడక్కడా సినిమా రెగ్యులర్ ఫార్మాట్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక చెప్పుకోదగినది అంటే సినిమా రన్ టైం. కిక్ 2 సినిమాని 161 నిమిషాలపాటు కాకుండా ఇంకాస్త కుదించి 140 నిమిషాల్లో చెప్పి ఉంటే ఇంకా బాగుండేది.
సాంకేతిక విభాగం :
ఈ మ‌ధ్య తెలుగు స్టోరీల క‌థ‌ల‌న్నీ.. మ‌న రాష్ట్రంలో కాకుండ సెకండాఫ్ వ‌చ్చే స‌రికి ఏదో ఒక ప‌క్క రాష్ట్రానికి క‌థ‌ను షిఫ్ట్‌ చేస్తున్నారు. ఏదో కొత్త ద‌నం అడియ‌న్స్ కు చూపించాల‌నే త‌పన కావోచ్చు. అలాగే ‘కిక్ 2′ సినిమాలో మనకు బాగా కొత్తగా అనిపించేది కథ కోసం ఎంచుకున్న బిహార్ లోని విలాస్ పూర్ బ్యాక్ డ్రాప్. ఈ బిహార్ బ్యాక్ డ్రాప్ ని, అక్కడి కల్చర్ ని, అక్కడి లొకేషన్స్ ని సినిమాకి సరిపోయేలా పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. ఈ విషయంలో మార్కులు కొట్టేసింది సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసయన్స్ ని థ్రిల్ చేసేలా ఉన్నాయి. నారాయణ రెడ్డి ఆర్ట్ వర్క్ బాగుంది. రామ్ ల‌క్ష్మ‌ణ్ స్టంట్స్ చాల బావున్నాయి. అయితే డైరెక్ట‌ర్ సురెంద‌రెడ్డి.. త‌ను గతంలో ర‌వితేజ , ఇలియానా ల‌తో చేసిన కిక్ రేంజ్ క‌థ‌ను, సిద్దం చేసుకోలేక పోయారు. కిక్ పేరు పెట్టుకుండ వేరే పెరు పెట్టిన మ‌రింత బెట‌ర్ గా వుండేది. ఈ సినిమా పేరు పెట్ట‌డంతో.. ఆడియ‌న్స్ కిక్ చిత్రంతో పోల్చుకుంటున్నారు. దాంతో పోల్చిన‌ప్పుడు కిక్ 2 తేలిపోతుంటుంది. ఒక హిట్ సినిమా పేరు తో చిత్రం చేస్తున్న‌ప్పుడు అంచ‌నాలు ఒక రేంజ్ లో వుంటాయ‌నే విష‌యం ఆయ‌న‌కు తెలియ‌నిది కాదు. అంచ‌నాలు రీచ్ కాలేక పోయార‌నే చెప్పాలి. నిర్మాత‌గా నందమూరి కళ్యాణ్ రామ్ తన ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో మరోసారి హిట్ ఫిల్మ్ ని అందించడమే కాకుండా తన బ్యానర్ లో ప్రేక్షకులను మెప్పించే సినిమాలే వస్తాయని మరోసారి నిరూపించాడు. ఈ సినిమా ఓ రేంజ్ గ్రాండ్ లెవల్లో రావడానికి తనే ప్రధాన కారణం అని చెప్పడంలో అనుమానమే లేదు.
తీర్పు :
బిజినెస్ ప‌రంగా తెలిగ్గా ఉంటుంది క‌దాని హిట్ సినిమా పేరును వాడుకున్నారు. మ‌రి ఆడియ‌న్స్ అంచ‌నాలు రీచ్ అయ్యే విధంగా కొత్త‌ద‌నం కోసం ప్ర‌య‌త్నించాల్సింది. కేవ‌లం బ్యాక్ డ్రాప్ కొత్త‌ద‌నం ఉండే స‌రిపోతుందినుకున్నారు. క‌థ‌లో కొత్త ద‌నం ఏమి అనిపించ‌దు. మొద‌టి భాగంలో ప్ర‌తి సీన్.. ఓవ‌రాల్ గా చూసిన అభిమానుల‌కు ఒక డిఫ‌రెంట్ శాటిస్ ఫెక్ష‌న్ ఇచ్చింది. కానీ ఈ చిత్రంలో అది మిస్ అయ్యింది. అలా అని సినిమా బాలేద‌ని చెప్ప‌లేం. చాల బావుందని చెప్ప‌లేం. ఏ విధ‌హైన అంచ‌నాలు లేకుండా వెళ్లి .. సినిమాను చూసిన వారు బాగా ఎంజాయ్ చేస్తారు. ప్ర‌తి దానికి కిక్ తో పోల్చి చూసుకునే వాళ్లు కొంత నిరాశ ప‌డే అవ‌కాశం ఉంది. సెకండాఫ్ లో కూడా ర‌వితేజ మార్క్ కామెడి మిస్ అవ్వ‌కుండ మ‌రింత‌గా ద‌ర్శ‌కుడు వ‌ర్కువుట్ చేసి వుంటే కిక్ 2 నిజంగానే పేరుకు త‌గ్గట్లు డ‌బుల్ కిక్ ఇచ్చేది. అయితే ఫైన‌ల్ గా ఒక‌సారి చూడోచ్చు. ఆడియ‌న్స్ పెట్టే టికెట్ ఖ‌రీదుకు న‌ష్టం అయితే లేదు.
First Published:  21 Aug 2015 10:17 AM IST
Next Story