పట్టపగలు నడివీధిలో గుల్బర్గా ముఠా కాల్పులు
పట్టపగలు… రాజధాని నగరం నడిబొడ్డు… చుట్టూ పోలీసులు అయినా ఆ దొంగలు అదరలేదు.. బెదరలేదు. పైగా పోలీసులను భయపెట్టేందుకు నాటు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. దుండుగుడు కాల్చిన తూటా డీసీఎంలో ప్రయాణిస్తున్న మెట్రో కార్మికుడి ఛాతీలోకి దూసుకు పోయింది. అయితే, పోలీసులు, మెట్రో కార్మికులు కలిసి సినీఫక్కిలో వారిని వేటాడి వెంటాడి పట్టుకోవడంతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో నీరూస్ జంక్షన్ వద్ద […]
BY sarvi20 Aug 2015 6:39 PM IST
X
sarvi Updated On: 21 Aug 2015 6:25 AM IST
పట్టపగలు… రాజధాని నగరం నడిబొడ్డు… చుట్టూ పోలీసులు అయినా ఆ దొంగలు అదరలేదు.. బెదరలేదు. పైగా పోలీసులను భయపెట్టేందుకు నాటు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. దుండుగుడు కాల్చిన తూటా డీసీఎంలో ప్రయాణిస్తున్న మెట్రో కార్మికుడి ఛాతీలోకి దూసుకు పోయింది. అయితే, పోలీసులు, మెట్రో కార్మికులు కలిసి సినీఫక్కిలో వారిని వేటాడి వెంటాడి పట్టుకోవడంతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో నీరూస్ జంక్షన్ వద్ద పట్టపగలు నడివీధిలో దోపిడీదొంగలు కాల్పులు జరిపి కలకలం సృష్టించారు. ఈ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రెండు నాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. దుండుగులు కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన మీర్జా మహ్మద్ అబ్దుల్లా (32), మహ్మద్ సమీయుద్దీన్, అబ్దుల్ ఖదీర్ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. వీరు చార్మినార్‌లోని ఒక ప్రముఖ నగల దుకాణంలో దోపిడీ చేసేందుకు రాగా, ఆ పథకం వీలుకాక పోవడంతో మాదాపూర్‌లోని షాపింగ్‌మాల్స్‌లో దోపిడీ చేయాలని నిర్ణయించారు. అందుకోసం జూబ్లీహిల్స్ బిగ్‌సీ వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా వారిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో గాల్లోకి కాల్పులు జరుపుతూ పారిపోయే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు.
Next Story