బలవంతపు భూ సేకరణ తగదు- పి.మధు
ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలో బలవంతపు భూసేకరణ తగదని, ఈ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాజధానికి సరిపోయినన్ని భూములు ఇప్పటికే సమీకరించారని, కొత్తగా సేకరించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రైతుల భూములను పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం భూ సేకరణకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన భూ ఆర్డినెన్స్‌లను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ […]
BY Pragnadhar Reddy20 Aug 2015 8:47 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 20 Aug 2015 8:55 PM GMT
ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలో బలవంతపు భూసేకరణ తగదని, ఈ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాజధానికి సరిపోయినన్ని భూములు ఇప్పటికే సమీకరించారని, కొత్తగా సేకరించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రైతుల భూములను పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం భూ సేకరణకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన భూ ఆర్డినెన్స్‌లను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ప్రకటన చేయడం ఏ మాత్రమూ క్షమార్హం కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌లు ఇంతవరకు ఆమోదం పొందలేదని, అయినా వాటిని ఆసరాగా చేసుకుని సేకరించాలనుకుంటే చెల్లుబాటు కాదని ఆయన తెలిపారు. వెంటనే భూసేకరణ ప్రక్రియను నిలిపేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story