ప్రత్యేక హోదాపై పోరాటానికి మద్దతిస్తాం: బివి.రాఘవులు
ఎపికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మౌనం వహించడం ఆంధ్రప్రదేశ్‌ని మోసం చేయడమేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఢిల్లీలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎపికి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న బిజెపి ఇప్పుడు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు రాలతాయన్న కారణంతోనే బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడి ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రకటన ఎందుకు చేయరని […]
BY sarvi21 Aug 2015 11:38 AM IST
X
sarvi Updated On: 21 Aug 2015 11:53 AM IST
ఎపికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మౌనం వహించడం ఆంధ్రప్రదేశ్‌ని మోసం చేయడమేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఢిల్లీలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎపికి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న బిజెపి ఇప్పుడు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు రాలతాయన్న కారణంతోనే బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడి ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రకటన ఎందుకు చేయరని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా హామీని ఎన్నికల స్టంట్‌గా భావించవలసి వచ్చా అని రాఘవులు ప్రశ్నించారు. ఏపీ ప్రజల్ని ఎన్నికల్లో ఉపయోగించుకుందని విమర్శించారు. బీజేపీ ఇలా వ్యవహరిస్తుంటే చంద్రబాబు మౌనమునిలా నోరెందుకు ఎత్తడని ఆయన నిలదీశారు. ఎపికి ప్రత్యేహోదా కోసం వైసిపి చేస్తున్న పోరాటానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకహోదా కోసం ఎవరు ఆందోళనలు చేసినా మద్దతు ఇస్తామని చెప్పారు.
Next Story