స్థానిక ఎన్నికల్లో వసుంధర రాజేకు ఎదురుదెబ్బ
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజేకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగలింది. ముఖ్యంగా సీఎం రాజే ప్రాతినిధ్యం వహిస్తున్న ఝల్రా పఠావ్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆమె తనయుడు దుష్యంత్ ప్రాతినిధ్యం వహిస్తోన్నఝలావర్-బరస్ పార్లమెంటు నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. మొత్తం 129 సీట్లకు గాను బీజేపీ కేవలం 78 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 34 సీట్లు దక్కగా, స్వతంత్రులకు 16 స్థానాలు దక్కాయి. ఈ ఎన్నికల్లో ఐపీఎల్ స్కాం నిందితుడు లలిత్ మోడీ […]
BY sarvi20 Aug 2015 6:40 PM IST
X
sarvi Updated On: 21 Aug 2015 6:29 AM IST
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజేకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగలింది. ముఖ్యంగా సీఎం రాజే ప్రాతినిధ్యం వహిస్తున్న ఝల్రా పఠావ్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆమె తనయుడు దుష్యంత్ ప్రాతినిధ్యం వహిస్తోన్నఝలావర్-బరస్ పార్లమెంటు నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. మొత్తం 129 సీట్లకు గాను బీజేపీ కేవలం 78 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 34 సీట్లు దక్కగా, స్వతంత్రులకు 16 స్థానాలు దక్కాయి. ఈ ఎన్నికల్లో ఐపీఎల్ స్కాం నిందితుడు లలిత్ మోడీ వివాదంతో పాటు, సీఎం కుమారుడు దుష్యంత్ వ్యవహారశైలి కూడా బీజేపీ ఆశించిన స్థానాలు దక్కకపోవడానికి కారణంగా కనిపిస్తోంది.
Next Story