రూ.50లతో ఒక్కొక్కరికి రూ.5 లక్షల ప్రమాద బీమా!
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇచ్చిన హామీ నెరవేర్చారు. సామాజిక భద్రతా పథకం కింద కొన్ని వర్గాలకు బీమా రక్షణ కల్పిస్తామని కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. పోలీసుశాఖలో పనిచేసే హోంగార్డులు, మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, రవాణా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు రూ.50 ప్రీమియంతో రూ.5 లక్షల ప్రమాద బీమా పథకం వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. […]
BY sarvi21 Aug 2015 12:02 AM GMT
X
sarvi Updated On: 21 Aug 2015 12:02 AM GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇచ్చిన హామీ నెరవేర్చారు. సామాజిక భద్రతా పథకం కింద కొన్ని వర్గాలకు బీమా రక్షణ కల్పిస్తామని కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. పోలీసుశాఖలో పనిచేసే హోంగార్డులు, మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, రవాణా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు రూ.50 ప్రీమియంతో రూ.5 లక్షల ప్రమాద బీమా పథకం వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం బీమా పథకంలో చేరిన ప్రతి వ్యక్తి.. రూ.50 ప్రీమియంతోపాటు 14శాతం సేవా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ. 57 రూపాయలవుతుందన్న మాట. ఆర్థికశాఖ అధికారుల ఆదేశాలకు అనుగుణంగా కార్మికశాఖలోని భవన నిర్మాణ విభాగం.. నిబంధనల ప్రకారం సామాజిక భద్రతా పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తుంది. వెబ్ జర్నలిస్టులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండు చేస్తున్నారు.
రవాణా రంగంలో 9,68,680 మంది డ్రైవర్లు, 21,289 మంది హోంగార్డులకు, 10 వేల మంది వర్కింగ్ జర్నలిస్టులతో కలిపి మొత్తం పది లక్షల మందికి ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతుంది. దీని అమలుకు నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థకు ఏటా రూ.5 కోట్ల ప్రీమియం చెల్లిస్తారు. కార్మిక, రవాణాశాఖల్లో నమోదైన డ్రైవర్ల జాబితాను ఇన్సూరెన్స్ కంపెనీకి అందజేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ఆటో డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టు, నాన్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లకు ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతుంది. హోంగార్డుల జాబితాను హోంశాఖలోని హోంగార్డుల విభాగం డీఐజీ, వర్కింగ్ జర్నలిస్టుల జాబితాను సమాచారశాఖ సంచాలకులు ఇన్సూరెన్స్ కంపెనీకి అందజేస్తారు.
Next Story