ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు
ఒక వ్యక్తి దేశం విడిచి వెళ్ళేందుకు ప్రధానంగా ఉపయోగపడే పాస్‌పోర్టుల జారీలో అక్రమాలు జరుగుతున్నాయనే విషయం ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉన్న విషయం. దీనిపై అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. ఇందుకు కారణం పోలీసు శాఖలో ఉండే వారన్న అనుమానాల నేపథ్యంలో పాస్ పోర్టు దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ ఎఎస్సై సహా నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. […]
BY Pragnadhar Reddy20 Aug 2015 6:39 PM IST
Pragnadhar Reddy Updated On: 21 Aug 2015 2:56 AM IST
ఒక వ్యక్తి దేశం విడిచి వెళ్ళేందుకు ప్రధానంగా ఉపయోగపడే పాస్‌పోర్టుల జారీలో అక్రమాలు జరుగుతున్నాయనే విషయం ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉన్న విషయం. దీనిపై అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. ఇందుకు కారణం పోలీసు శాఖలో ఉండే వారన్న అనుమానాల నేపథ్యంలో పాస్ పోర్టు దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ ఎఎస్సై సహా నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారు నగరం విడిచి వెళ్లరాదని కమిషనర్ ఆదేశించారు.
Next Story