Telugu Global
Others

Wonder World 1

కొలంబస్‌ సముద్ర ప్రయాణానికి స్పెయిన్‌ రాజులు ఆరువేల డాలర్లు ఖర్చు పెట్టారు. వంద సంవత్సరాల తర్వాత దానికి ప్రతిఫలంగా పదిహేను లక్షలా యాభైవేల డాలర్ల విలువ కలిగిన బంగారం వారికి అందింది. * * * హిట్లర్‌కు యూదుల పట్ల వున్న ద్వేషం తెలిసిందే. డెన్మార్క్‌లోని యూదుల్ని తక్కువ చెయ్యడానికి, వాళ్ళని గుర్తించడానికి అక్కడ వున్న యూదులందరూ నక్షత్రం గుర్తున్న చేతి పట్టీలను ధరించాలని ఆర్డర్‌ జారీ చేశాడు. ఆ చట్టం చేసిన కొన్ని గంటల్లో మతాలకు […]

కొలంబస్‌ సముద్ర ప్రయాణానికి స్పెయిన్‌ రాజులు ఆరువేల డాలర్లు ఖర్చు పెట్టారు. వంద సంవత్సరాల తర్వాత దానికి ప్రతిఫలంగా పదిహేను లక్షలా యాభైవేల డాలర్ల విలువ కలిగిన బంగారం వారికి అందింది.

* * *

హిట్లర్‌కు యూదుల పట్ల వున్న ద్వేషం తెలిసిందే. డెన్మార్క్‌లోని యూదుల్ని తక్కువ చెయ్యడానికి, వాళ్ళని గుర్తించడానికి అక్కడ వున్న యూదులందరూ నక్షత్రం గుర్తున్న చేతి పట్టీలను ధరించాలని ఆర్డర్‌ జారీ చేశాడు. ఆ చట్టం చేసిన కొన్ని గంటల్లో మతాలకు అతీతంగా డెన్మార్క్‌లోని ప్రజలందరూ పట్టీలు కట్టుకున్నారు. రాజయిన క్రిస్టియన్‌ కూడా పట్టీ ధరించి నేను ఈ దేశంలోని మొదటి యూదుణ్ణి అని ప్రకటించాడు.

* * *

ప్రపంచంలో ఎక్కువ సంవత్సరాలు ఒక దేశాన్ని పాలించిన రాజుగా చరిత్ర చెబుతున్న రాజు ఈజిప్టు పాలకుడయిన పెపి 2. క్రీస్తుపూర్వం 2272లో అతనికి రాజుగా అభిషేకం జరిగింది. పసివాడుగా వున్నప్పుడే రాజయ్యాడు. క్రీస్తుపూర్వం 2182 దాకా ఈజిప్టును పాలించాడు. అంటే దాదాపు తొంభై సంవత్సరాలు రాజుగా వున్నాడు.

* * *

ష్యా రాజయిన జార్‌నికోలన్‌ 1 రష్యా చుట్టూ కంచె ఏర్పాటు చెయ్యాలనుకున్నాడట.

* * *

బాబిలోనియా చరిత్రని బట్టి ఎన్‌లిల్‌-ఐని కథ తెలుస్తుంది. అతను రాజయిన ‘ఎర్రా ఇమిట్టి’కి తోటమాలి. నూతన సంవత్సర ఉత్సవాల్లో రాజు అతన్ని ‘ఒకరోజు రాజు’గా ఎంపిక చేశాడు. అతన్ని దేవతలకు బలి ఇస్తారు. కానీ ‘ఎన్‌లిల్‌-ఐని’ విషయంలో అది తలకిందులైంది. ఎందుకంటే నూతన సంవత్సర వేడుకల్లో రాజయిన ఎర్రా ఇమిట్టి ఎందుకో చనిపోయాడు. ఒకరోజు రాజు రాజుగానే వుండిపోయాడు. అతను దాదాపు 24 సంవత్సరాలు దేశాన్ని బాగా పాలించాడు.

First Published:  19 Aug 2015 1:04 PM GMT
Next Story