Telugu Global
Others

యేడాది జైలుకు బదులు రూ.60 కోట్ల జరిమానా

1997లో జ‌రిగిన సినిమా హాలు అగ్నిప్ర‌మాదంలో నిందితులకు జైలు శిక్ష విధించాల్సిన అవ‌స‌రం లేద‌ని రూ. 60 కోట్ల జ‌రిమానా చెల్లిస్తే సరిపోతుందని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. కేసు వివ‌రాల్లోకి వెళితే ఢిల్లీలోని ఉప‌హార్ సినిమాహాల్లో 1997, జూన్ 13న బోర్డ‌ర్ సినిమా ప్ర‌ద‌ర్శిస్తున్న స‌మ‌యంలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో 59 మంది మ‌ర‌ణించారు. ఆ ప్ర‌మాదంపై విచారించిన ఢిల్లీ కోర్టు సిన్మా హాలు  య‌జ‌మానులు సుశీల్ అన్సాల్‌, గోపాల్ అన్సాల్‌ల‌కు ఏడాది […]

1997లో జ‌రిగిన సినిమా హాలు అగ్నిప్ర‌మాదంలో నిందితులకు జైలు శిక్ష విధించాల్సిన అవ‌స‌రం లేద‌ని రూ. 60 కోట్ల జ‌రిమానా చెల్లిస్తే సరిపోతుందని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. కేసు వివ‌రాల్లోకి వెళితే ఢిల్లీలోని ఉప‌హార్ సినిమాహాల్లో 1997, జూన్ 13న బోర్డ‌ర్ సినిమా ప్ర‌ద‌ర్శిస్తున్న స‌మ‌యంలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో 59 మంది మ‌ర‌ణించారు. ఆ ప్ర‌మాదంపై విచారించిన ఢిల్లీ కోర్టు సిన్మా హాలు య‌జ‌మానులు సుశీల్ అన్సాల్‌, గోపాల్ అన్సాల్‌ల‌కు ఏడాది జైలు శిక్ష విధించగా, వారు సుప్రీంను ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌ను విచారించిన సుప్రీం త్రిస‌భ్య‌ ధ‌ర్మాస‌నం నిందితులకు జైలు శిక్ష అవ‌స‌రం లేద‌ని, రూ. 60 కోట్లు జ‌రిమానా చెల్లించాల‌ని తీర్పు ఇచ్చింది. నిందితులు ఇద్ద‌రూ చెరో రూ. 30 కోట్ల జ‌రిమానాను మూడు నెల‌ల్లో ఢిల్లీ ప్ర‌భుత్వానికి జ‌మ చేయాల‌ని, ఆ మొత్తాన్ని ప్ర‌భుత్వం సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు వినియోగించాల‌ని ఆదేశించింది. సుప్రీం తీర్పుపై అగ్ని ప్ర‌మాద బాధిత కుటుంబాలు అసంతృప్తి వ్య‌క్తం చేశాయి. 18 ఏళ్లుగా ఈ కేసు కోసం పోరాడుతున్న కృష్ణ‌మూర్తి సుప్రీం తీర్పుపై మండిప‌డ్డారు. ధ‌న‌వంతులు ఏం చేసినా, డ‌బ్బు చెల్లిస్తే స‌రిపోతుంద‌నే విధంగా సుప్రీం తీర్పు ఉంద‌న్నారు. ఉప‌హార్ ప్ర‌మాదంలో కృష్ణ‌మూర్తి దంపతులు త‌మ ఇద్ద‌రు పిల్ల‌ల‌ను కోల్పోయారు.
First Published:  19 Aug 2015 6:44 PM IST
Next Story