రేవంత్‌రెడ్డి అరెస్ట్ ... విడుదల
మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమం రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేదాకా వెళ్లింది. ఇక్కడ జరుగుతున్న మార్కెట్ యార్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం తనను ఆహ్వానించలేదని, తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అక్కడకు వచ్చి ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇది తెలిసిన టిటీడీపీ కార్యకర్తలు అటు మార్కెట్ యార్డులోను, ఇటు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. తెలంగాణ […]
BY sarvi20 Aug 2015 5:14 AM IST
X
sarvi Updated On: 20 Aug 2015 9:55 AM IST
మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమం రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేదాకా వెళ్లింది. ఇక్కడ జరుగుతున్న మార్కెట్ యార్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం తనను ఆహ్వానించలేదని, తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అక్కడకు వచ్చి ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇది తెలిసిన టిటీడీపీ కార్యకర్తలు అటు మార్కెట్ యార్డులోను, ఇటు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ రేవంత్‌రెడ్డిని వెంటనే విడిచిపెట్టాలని డిమాండు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
కేసీఆర్ కుర్చీ దించేవరకు నిద్రపోనని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్ నుంచి విడుదల అయిన రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులను నిర్భందించినంత మాత్రాన టీడీపీని బెదిరించలేరన్నారు. అవినీతిని ఎండగడుతున్నారని కేసీఆర్ ప్రతిపక్షాలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ అంటే ఇంటింటికి చీప్‌లిక్కర్ ఇవ్వడమేనా? ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
Next Story