కేసీఆర్ దారి తప్పిండు... ఆడోళ్లు ఆయన భరతం పడ్తరు
సీఎం కేసీఆర్ దారి తప్పిండు … ఆయన భరతం పట్టి దారిలోకి తెచ్చేందుకు మహిళలు రెడీగా ఉన్నారని మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డి అన్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పుడు, అది చేస్తా గిది చేస్తా అన్నాడు. ముఖ్యమంత్రి కాంగానే సచివాలయం కూలకొడతా, చెస్ట్ ఆస్పత్రి తరలిస్తా, ఉస్మానియా ఆస్పత్రి కూలగొడతా అంటుండు. మరోవైపు తెలంగాణ ప్రజానీకాన్ని మందు తాగుండ్రి అంటుండు. గుడుంబా కంటే చీప్ లిక్కర్ ఆరోగ్యం అంటుండు. ఏదైనా ఆరోగ్యానికి హానికరమే కదా. ఎందుకయ్యా […]
BY Pragnadhar Reddy19 Aug 2015 6:42 PM IST
X
Pragnadhar Reddy Updated On: 20 Aug 2015 9:01 AM IST
సీఎం కేసీఆర్ దారి తప్పిండు … ఆయన భరతం పట్టి దారిలోకి తెచ్చేందుకు మహిళలు రెడీగా ఉన్నారని మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డి అన్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పుడు, అది చేస్తా గిది చేస్తా అన్నాడు. ముఖ్యమంత్రి కాంగానే సచివాలయం కూలకొడతా, చెస్ట్ ఆస్పత్రి తరలిస్తా, ఉస్మానియా ఆస్పత్రి కూలగొడతా అంటుండు. మరోవైపు తెలంగాణ ప్రజానీకాన్ని మందు తాగుండ్రి అంటుండు. గుడుంబా కంటే చీప్ లిక్కర్ ఆరోగ్యం అంటుండు. ఏదైనా ఆరోగ్యానికి హానికరమే కదా. ఎందుకయ్యా అర్థరాత్రి దాకా మందు దుకాణాలు. ఆడోళ్ల పుస్తెలమ్ముకోనీకా. ఇవి భరించలేక మహిళలు ఏదో ఒకరోజు ఆయన భరతం పట్టేందుకు రెడీగా ఉన్నారని బచావో తెలంగాణ మిషన్ ప్రారంభోత్సవ సందర్భంగా నాగం అన్నారు. కరువు మండలాలపై కలెక్టర్లు పంపిన నివేదికలపై సీఎం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, కరువు మండలాలను ప్రకటిస్తే కేంద్రం సాయం చేస్తుందన్న జ్ఞానం కూడా కేసీఆర్‌కు లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ బచావో మిషన్ ఆధ్వర్యంలో కరువు, విద్య, వైద్యం, అవినీతిలపై అంచెలంచెలుగా ఉద్యమిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యెన్నం శ్రీనివాసరెడ్డి, యోగీశ్వర్‌రెడ్డి తదితర్లు పాల్గొన్నారు.
Next Story