Telugu Global
Cinema & Entertainment

వంద కోట్ల బడ్జెట్ తో మహేష్ చిత్రం

శ్రీమంతుడు సినిమాతో తన రేంజ్ ఏంటో మరోసారి రుచిచూపించాడు మహేష్. అందుకే ఇప్పుడు ప్రిన్స్ తో బడా బడ్జెట్ సినిమాలు రూపొందించేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి లాభాలతో పాటు తిరిగిరావాలంటే మహేష్ కాల్షీట్ కంపల్సరీ అంటున్నారు. ఇందులో భాగంగా మహేష్ తో వంద కోట్ల భారీ బడ్జెట్ తో ఓ సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడు నిర్మాత డీవీవీ దానయ్య. దీనికి సంబంధించి ఇప్పటికే దర్శకుడు వీవీ వినాయక్ తో చర్చలు జరుపుతున్నాడు. […]

వంద కోట్ల బడ్జెట్ తో మహేష్ చిత్రం
X
శ్రీమంతుడు సినిమాతో తన రేంజ్ ఏంటో మరోసారి రుచిచూపించాడు మహేష్. అందుకే ఇప్పుడు ప్రిన్స్ తో బడా బడ్జెట్ సినిమాలు రూపొందించేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి లాభాలతో పాటు తిరిగిరావాలంటే మహేష్ కాల్షీట్ కంపల్సరీ అంటున్నారు. ఇందులో భాగంగా మహేష్ తో వంద కోట్ల భారీ బడ్జెట్ తో ఓ సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడు నిర్మాత డీవీవీ దానయ్య. దీనికి సంబంధించి ఇప్పటికే దర్శకుడు వీవీ వినాయక్ తో చర్చలు జరుపుతున్నాడు. మరోవైపు మహేష్ కూడా స్టోరీలైన్ సిద్ధమైతే డిస్కషన్లు స్టార్ట్ చేద్దామని హామీ ఇచ్చాడు. అవసరమైతే తను కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తానని మాటిచ్చాడు. ఇప్పటివరకు మహేష్-వినాయక్ కాంబోలో సినిమా రాలేదు. పైగా వంద కోట్ల బడ్జెట్ లో మహేష్ ఏ సినిమా చేయలేదు. దీంతో ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అయితే ఇది కార్యరూపం దాల్చాలంటే మాత్రం మరో ఏడాదైనా ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ప్రస్తుతం మహేష్ బ్రహ్మోత్సవానికి కాల్షీట్లు కేటాయించాడు. ఆ సినిమా విడుదలైన తర్వాత త్రివిక్రమ్ తో మరో సినిమా చేసేందుకు సిద్ధమౌతున్నాడు. ఆ తర్వాతే మహేష్-వినాయక్ సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.
First Published:  20 Aug 2015 12:36 AM IST
Next Story