ఎనీ టైమ్ లాకర్
ఎనీ టైమ్ మనీ (ఏటీఎం) మాదిరిగా ఎనీటైమ్ లాకర్ సౌలభ్యం కలిగిన స్మార్ట్ వాల్ట్ డిజిటల్ లాకర్ సేవలను ఐసీఐసీఐ బ్యాంకు ప్రారంభించింది. ఈ సందర్భంగా బ్యాంకు సీఈవో చందా కొచ్చర్ మాట్లాడుతూ ఆటోమేటిక్ సిస్టమ్ కలిగిన ఈ డిజిటల్ లాకర్‌కు పూర్తి స్థాయి భద్రత ఉంటుందన్నారు. వినియోగదారులు బ్యాంకు పనివేళలు, వారాంతాలు, సెలవు దినాలతో పని లేకుండా ఎప్పుడైనా వినియోగించవచ్చని చెప్పారు. బయోమెట్రిక్, పిన్ అథెంటికేషన్, డెబిట్ కార్డుల సహాయంతో లాకర్‌ను తెరవవచ్చు. బ్యాంకు సిబ్బంది […]
BY sarvi19 Aug 2015 6:37 PM IST

X
sarvi Updated On: 20 Aug 2015 4:48 AM IST
ఎనీ టైమ్ మనీ (ఏటీఎం) మాదిరిగా ఎనీటైమ్ లాకర్ సౌలభ్యం కలిగిన స్మార్ట్ వాల్ట్ డిజిటల్ లాకర్ సేవలను ఐసీఐసీఐ బ్యాంకు ప్రారంభించింది. ఈ సందర్భంగా బ్యాంకు సీఈవో చందా కొచ్చర్ మాట్లాడుతూ ఆటోమేటిక్ సిస్టమ్ కలిగిన ఈ డిజిటల్ లాకర్‌కు పూర్తి స్థాయి భద్రత ఉంటుందన్నారు. వినియోగదారులు బ్యాంకు పనివేళలు, వారాంతాలు, సెలవు దినాలతో పని లేకుండా ఎప్పుడైనా వినియోగించవచ్చని చెప్పారు. బయోమెట్రిక్, పిన్ అథెంటికేషన్, డెబిట్ కార్డుల సహాయంతో లాకర్‌ను తెరవవచ్చు. బ్యాంకు సిబ్బంది ప్రమేయం లేకుండా విలువైన పత్రాలు, వస్తువులు, నగదు, బంగారు నగలు దాచుకోవచ్చని ఆమె చెప్పారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే బ్యాంకుకు రెండు నుంచి మూడు రకాల్లో చెల్లింపులు జరపాల్సి ఉంటుందని ఆమె చెప్పారు.
Next Story